Suryaa.co.in

Andhra Pradesh

15 మంది అధికారులు కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వస్తే, వారిలో 10 మంది రెడ్లే

• తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలు, అరాచకాలు చేయిస్తున్న జగన్ రెడ్డి, తనకు అడ్డొచ్చే ఇతర వర్గాల్ని ఊచకోత కోయిస్తున్నాడు
• పెరిగిన మద్యం ధరలు.. కల్తీ మద్యం అమ్మకాలపై ప్రశ్నించాడన్న అక్కసుతో ఓంప్రతాప్ అనే దళితయువకుడిని దారుణంగా చంపించడమేనా జగన్ అమలు చేసిన సామాజిక న్యాయం?
• ఇసుకదోపిడీపై ప్రశ్నించిన పాపానికి వరప్రసాద్ అనే దళిత యువకుడికి ఈ ప్రభుత్వం ఇచ్చిన కానుక శిరోముండనమా? ఇదేనా జగన్ రెడ్డి చేసిన సామాజిక న్యాయం?
• తాము చేసిన తప్పులకు తమను టీడీపీప్రభుత్వం శిక్షిస్తుందన్న భయతోనే కొందరు అధికారులు తిరిగి కేంద్రసర్వీసులకు వెళ్లడానికి వెంపర్లాడుతున్నారు
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం అచ్చెన్నాయుడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ పాల్గొన్నారు.

“ జగన్ రెడ్డి…అతని ప్రభుత్వం తమ మార్క్ పాలనకు విరుద్ధంగా కొత్త పల్లవి పాడుతోంది. నా ఎస్సీలు…నా ఎస్టీలు..నా బీసీలు…నా మైనారిటీలు అనే నైతిక హక్కు జగన్ రెడ్డికి..అతని పార్టీ, ప్రభుత్వానికి లేదని ఘంఠాపథంగా చెబుతున్నాం. పరిపాలన అంటే ఏమిటో జగన్ రెడ్డికి తెలియదు. అధికారంలో ఉన్నానన్న అహంకారంతో జగన్ రెడ్డి ప్రజాసంక్షేమాన్ని.. రాష్ట్రాభివృద్ధిని పూర్తిగా విస్మరించాడు.

ప్రజలు తనను ముఖ్యమంత్రిని చేసింది కేవలం దోపిడీ.. అవినీతి కోసమే అన్నట్టు ముఖ్యమంత్రి తీరుంది. జగన్ రెడ్డి, తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలు, అరాచకాలు చేయిస్తూ అడ్డొచ్చే ఇతరవర్గాల్ని ఊచకోత కోయిస్తున్నాడు. మంచి అనుభవజ్ఞులైన అధికారులు కూడా స్వప్రయోజనాల కోసం జగన్ దుర్మార్గాలు, దోపిడీకి వంతపాడే దుస్థితిని రాష్ట్రంలో చూస్తున్నాం.

15 మందిలో 10 మంది తన వర్గం వారే
జగన్ రాష్ట్రానికి 15 మంది సివిల్ సర్వీస్ అధికారుల్ని కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై తీసుకొస్తే, వారిలో 10 మంది తన వర్గం వారే ఉండేలా చూసుకున్నాడు. ఆ 10 మందిని కావాలనే ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో జగన్ రెడ్డి నియమించాడు.

ఎన్. రమణారెడ్డి (గతంలో – రైల్వే పర్సనల్ సర్వీస్ : ప్రస్తుతం- ఎన్.ఆర్.ఈ.డీ క్యాబ్ వీసీ.ఎండీ), తుమ్మల విజయ్ కుమార్ రెడ్డి (ప్రస్తుతం- ఐ అండ్ పీఆర్ కమిషనర్), ఏ.వీ.ధర్మారెడ్డి (గతంలో – డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ : ప్రస్తుతం – టీటీడీ ఈవో), డీ.వాసుదేవరెడ్డి (గతంలో – రైల్వే ట్రాఫిక్ సర్వీస్ : ప్రస్తుతం – ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ), ఏ.మదుసూదన్ రెడ్డి (గతంలో – రైల్వే అకౌంట్స్ సర్వీస్ : ప్రస్తుతం – ఫైబర్ నెట్ ఎండీ), జీ.వెంకటరెడ్డి (గతంలో – కోస్ట్ గార్డ్ సర్వీస్ : ప్రస్తుతం – మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్), చిలకల రాజేశ్వర్ రెడ్డి ( గతంలో – ఐ.ఆర్.ఎస్ : ప్రస్తుతం-రెవెన్యూ ఇంటిలిజెన్స్ స్పెషల్ కమిషనర్), ఎం.రమణారెడ్డి (గతంలో – ఐ.ఆర్.ఎస్ : ప్రస్తుతం – ఏపీ టవర్స్ సీఈవో), సీ.ఎస్.దివాన్ రెడ్డి (గతంలో – రైల్వే పర్సనల్ సర్వీస్ : ప్రస్తుతం-విద్యా మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ఎండీ), ఎస్.వీ.కే.రెడ్డి (గతంలో – చీఫ్ ఇంజనీర్ : ప్రస్తుతం : సీఈవో వాటర్ వేస్).

ఎవరు వీళ్లంతా? వీళ్లు కేంద్రంలో పనిచేసిన విభాగాలేంటి.. రాష్ట్రంలో వెలగ బెడుతున్న పనులేంటి? డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చిన అధికారులకు కీలకబాధ్యతలు.. అప్పగించడం పాలనా నిబంధనలకు విరుద్ధమని తెలిసీ జగన్ రెడ్డి తన వర్గానికి కీలక బాధ్యతలు అప్పగిం చింది ముమ్మాటికీ తన దోపిడీ కోసమే.

ప్రజల, ప్రభుత్వ సొమ్ముని.. ప్రకృతి సంపదను దోచుకునేది జగన్ రెడ్డి అయితే..ఆయన దోపిడీకోసం మానప్రాణాలు పోగొట్టుకోవాల్సింది దళితులు.. బడుగువర్గాలా?
టీటీడీ ఈవోగా జగన్ నియమించిన వ్యక్తి పని తీరు ఎలా ఉందో నిన్న ప్రధాని మోదీ సాక్షిగా బట్టబయలైంది. టీటీడీ ప్రతిష్ట మంటగలిసింది.. హిందూ ధర్మాన్ని కాపాడాలని గతంలో ప్రధానార్చకుడిగా పనిచేసిన వ్యక్తి నేరుగా ప్రధానికే మొరపెట్టుకోవడంపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ జగన్ రెడ్డికి బంగారు బాతుగా మారింది. తనకు అత్యంత సన్నిహితుడైన వాసుదేవరెడ్డిని ఆ కార్పొరేషన్ కు ఛైర్మన్ ను చేసిన జగన్ రెడ్డి.. మద్యం తయారీ.. సరఫరా..అమ్మకాల రూపంలో వేలకోట్లు కొట్టేస్తున్నాడు.

ప్రజల ప్రాణాలు పోతున్నా.. మహిళల మానప్రాణాలు మంటగలుస్తున్నా.. జగన్ రెడ్డికే దోచుకోవడమే పరమావధిగా మారింది. పెరిగిన మద్యం ధరలు.. కల్తీ మద్యం అమ్మకాలపై ప్రశ్నించాడన్న అక్కసుతో ఓంప్రతాప్ అనే దళిత యువకుడిని దారుణంగా చంపించడమేనా జగన్ అమలుచేసిన సామాజిక న్యాయం? ప్రజల, ప్రభుత్వ సొమ్ముని.. ప్రకృతి సంపదను దోచుకునేది జగన్ రెడ్డి అయితే..ఆయన దోపిడీకోసం మానప్రాణాలు పోగొట్టుకోవాల్సింది దళితులు.. బడుగువర్గాల వారా? చంద్రబాబు ప్రకృతి ఇచ్చిన సహజ వనరు ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించి, పేదలు.. కార్మికులకు ఎనలేని మేలుచేశారు.

జగన్ రెడ్డి మాత్రం అదే ఇసుకను దోచుకోవడానికి జీ.వెంకటరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చి, అతన్ని మైనింగ్ అండ్ జియాలజీ డైరెక్టర్ని చేశాడు. కార్మికులు చనిపోయినా.. రాష్ట్రంలో నిర్మాణరంగం కుదేలైనా… వేల కుటుంబాలు రోడ్డున పడినా తనకు సంబంధంలేదు… నువ్వే నాకు నెలానెలా ఇంత మొత్తం ఇసుక దోపిడీ తాలూకా సొమ్ము తెచ్చివ్వాలని జగన్ రెడ్డి, వెంకటరెడ్డిని ఆదేశించి మరీ తన వాటా తాను క్రమం తప్పకుండా కొట్టేస్తున్నది నిజం కాదా?

రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్ లలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంకటరెడ్డి అండదండలతో జగన్ రెడ్డి యథేచ్ఛగా ఇసుకతవ్వకాలు జరిపిస్తున్నాడు. ఇసుకదోపిడీపై ప్రశ్నించిన పాపానికి వరప్రసాద్ అనే దళిత యువకుడికి ఈ ప్రభుత్వం ఇచ్చిన కానుక శిరోముండనమా? ఇదేనా జగన్ రెడ్డి చేసిన సామాజిక న్యాయం? జగన్ రెడ్డి ఇసుక దోపిడీకి సంబంధించిన ఆధారాలను టీడీపీ బయటపెట్టినా ప్రభుత్వం లో ఎలాంటి చలనం లేదు.

టీడీపీ ప్రభుత్వం వస్తే తమకు శిక్షతప్పదని తెలిసే తప్పు చేసిన అధికారులు తిరిగి వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు
తన దోపిడీ పాలన ముగియనున్న తరుణంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన అధికారుల్ని తిరిగి వెనక్కు పంపడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడు. తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోం దని.. తమపరిస్థితి దారుణంగా ఉండనుందని తెలిసే డిప్యుటే షన్ పై వచ్చిన అధికారులు వెనక్కు వెళ్లేందుకు..రాష్ట్రంలోని కొందరు అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు వెంపర్లాడుతున్నారు. తప్పుచేసిన అధికారులు ఎక్కడున్నా వదిలేదిలేదు.

టీడీపీప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి, చట్టబద్ధంగా తప్పుచేసిన అధికారుల్ని శిక్షించి తీరుతాం. జగన్ రెడ్డి అతని ప్రభు త్వం కొట్టేసిన ప్రజలసొమ్ముని కక్కించి, తిరిగి ప్రజలకు పంచుతాం. జగన్ రెడ్డి చేసిన..చేస్తున్న సామాజిక న్యాయం ఎలా ఉందో ప్రభుత్వంలోని దళిత, బీసీ, మైనారిటీ సామాజిక వర్గ మంత్రులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తున్నాం.

విలేకరుల ప్రశ్నలకు అచ్చెన్నాయుడి స్పందన…

దొంగే దొంగ అన్నట్టుగా జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వ తీరుంది. డిప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చి.. వారే దోపిడీ చేసి.. వారే ముఖ్యమంత్రికోసం ప్రజలసొమ్ము కొల్లగొట్టి.. వారే టీడీపీపై ఆరోపణలుచేయడం, తప్పుడు కేసులు పెట్టడం చేస్తున్నారు. భవిష్యత్ లో చంద్రబాబు నాయుడు…టీడీపీప్రభుత్వం తమను వదలవని తెలిసే ముందే తప్పుడు కేసులు పెట్టారు. వాసుదేవరెడ్డికి సంబంధమే లేని వ్యవహారంలో ఆయన కావాలనే చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టాడు. చంద్రబాబు ప్రజల కు ఉచితంగా ఇసుక అందిస్తే.. అది అవినీతి అంటారా? ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా?

తప్పుచేసిన వారిని ఎక్కడున్నా వదిలిపెట్టం. టీడీపీ ప్రభుత్వం మనసా..వాచా..కర్మణా ప్రజలకోసమే పనిచేస్తుంది. వై.వీ. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలను రాష్ట్రానికి సామంతరాజులుగా నియమించిన జగన్ రెడ్డి, వారిద్వారా నాలుగున్నరేళ్లలో లక్షలకోట్లు దోచేశాడు. వైసీపీలోని దళిత…బీసీ నేతల.. ఆయా వర్గాల మంత్రులు, పేరుకే నాయకులు” అని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE