Suryaa.co.in

Andhra Pradesh

అధికారుల జట్టుదే విజయం

–క్రికెట్‌ టోర్నీలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు
– ఎంపీ, ఎమ్మెల్యే, జర్నలిస్టులతో టోర్నీ

తిరుపతి: జర్నలిస్ట్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ 10వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఆదివారం వెటర్నరీ కళాశాల క్రీడామైదానంలో క్రికెట్‌ పోటీలను నిర్వహించారు. ఐఏఎస్, ఐపీఎస్, ప్రజాప్రతినిధుల టీమ్‌తో రాష్ట్ర జర్నలిస్టుల టీమ్‌ పోటీపడింది. ఈ క్రమంలో అధికారుల జట్టు 20 పరుగుల తేడాతో విజేతగా నిలిసి గోల్డ్‌ కప్‌ను స్వంతం చేసుకుంది.

ఈ మ్యాచ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి టాస్‌ వేసి పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే బౌలింగ్‌ చేయగా ఎంపీ గురుమూర్తి బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ప్రారంభించారు. అధికారుల టీమ్‌లో డీఐజీ ఆవుల రమేష్‌రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి , మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.ఎస్‌. గిరీష, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పల నాయుడుతో పాటు పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన అధికారుల జట్టు 18 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఎస్పీ 24 పరుగులు, కమీషనర్‌ 16 పరుగులు చేశారు. అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన జేశాప్‌ జట్టు 18 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. దీంతో అధికారుల జట్టుకు 20 పరుగుల విజయం దక్కింది. బ్యాటింగ్‌లో 24 పరుగులు చేయడమే కాక, 3 వికెట్లు తీసిన అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు మ్యాన్‌ ఆప్‌ ద మ్యాచ్‌గా నిలిచారు. విన్నర్స్, రన్నర్స్‌లకు గోల్డ్‌ కప్‌ను అందజేశారు.

LEAVE A RESPONSE