– ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్
విజయవాడ: విశ్వకర్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు అని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పర్వ దినంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిజిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఇరవైసూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ హోదాలో ముఖ్యమంత్రికి లేఖ రాశాను ఈ లేఖ రాయడానికి స్ఫూర్తి ప్రధాని నరేంద్ర మోడీ. గత మన్ కీ బాత్ కార్యక్రమంలో చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ విశ్వకర్మ జయంతి ప్రాముఖ్యత ప్రస్తావన చేయడం, వెంటనే ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
నా విన్నపాన్ని ఆమోదించి విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని అధికార లాంఛనాలతో పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులతో అధికారులు కలిసి నిర్వహించాలని ఆయన కోరారు. ఉత్తర్వులు జారీ చేయడానికి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.