Suryaa.co.in

Telangana

లంచాల అధికారులపై వేటు తప్పదు

– అవినీతి ఫిర్యాదులపై స్పందించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

LEAVE A RESPONSE