Suryaa.co.in

National

జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం

శ్రీనగర్‌: జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా నేషనల్‌ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర‌నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ- కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణస్వీకారం చేయించారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఆప్ నేత సంజయ్ సింగ్, ఎన్సీపీ-ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డీ రాజా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ‌ కార్యక్రమానికి హాజరయ్యారు.

LEAVE A RESPONSE