– ముఖ్యమంత్రి చెప్పులు వేసుకుని తిరగటం ఏంటి
– యజ్ఞానికి జగన్ రెడ్డి సతీసమేతంగా ఎందుకెళ్లరు ?
– వెంకటేశ్వర స్వామి వారికి కుంటుంబ సమేతంగా పట్టువస్త్రాలు ఎన్నిసార్లు సమర్పించారు?
-జగన్ రెడ్డి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
– ఇష్టంలేనపుడు యాగం చేయటం ఎందుకు
– ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయటం కాదా?
వచ్చే ఎన్నికల్లో హిందువుల సత్తా ఏంటో జగన్ రెడ్డిచూపిస్తాం
– టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న యాగ మండపంలోకి సీఎం కుంటుంబ సమేతంగా వెల్లకుండా సనాతన ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారు. పవిత్ర యాగం జరిగే ప్రదేశంలో ముఖ్యమంత్రి చెప్పులు వేసుకుని తిరగటం ఏంటి? ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయటం కాదా?
ఇష్టంలేనపుడు యాగం చేయటం ఎందుకు హిందువులను అవమానించటం ఎందుకు? గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా వైసీపీ నాలుగేళ్ల పాలనలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. కానీ నిందితులపై చర్యలు శూన్యం. పవిత్ర స్దలమైన తిరుపతి కొండపై గంజాయి అమ్ముతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి?
తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కుంటుంబ సమేతంగా పట్టువస్త్రాలు ఎన్నిసార్లు సమర్పించారో జగన్ రెడ్డి సమాదానం చెప్పాలి? ఒంటి మిట్ట దేవస్థానికి వెళ్లడానికి కాలు నొప్పి సాకు చెప్పిన జగన్ మరుసటి రోజే చిలకలూరిపేట సభకు ఎలా వెళ్లారు? హిందువులతో పెట్టుకున్న ఏప్రభుత్వం నిలబడలేదు. వచ్చే ఎన్నికల్లో హిందువుల సత్తా ఏంటో జగన్ రెడ్డి కి చూపిస్తాం.