వైకాపా పాపాల ఫలితాలు ఇలా వెంటాడుతూనే ఉంటాయి!
“అదానీ సిమెంటు పరిశ్రమ మాకొద్దు!” అని గళమెత్తిన విశాఖ ప్రజల పోరాటం… అది ఓ నినాదం కాదు, ఓ నిబద్ధత. స్థానిక సంఘాలు, ప్రజలు కలసి చేసిన ఆ ఉద్యమానికి ప్రభుత్వం ఉక్కుపాదం మోపలేదు. నిర్బంధం లేదు. అణచివేత లేదు. అదానీకి అనుకూలంగా వ్యవహరించలేదు. ప్రజల స్వరం వినిపించేలా వదిలింది.
కానీ అదే జగన్ ప్రభుత్వం… ఏటా లాభాల్లో నడిచే గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాను, పప్పు బెల్లాలకు లెక్కన, ముష్టిగా 600 కోట్లకు అమ్మేసింది. ఆ తర్వాత యజమాని వాటా కూడా అదానీ చేతికి వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడ అంబుజా సిమెంటు పరిశ్రమ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే… ప్రజలు మళ్లీ గళమెత్తారు. తిరగబడ్డారు. విశాఖ ప్రజల చైతన్యం… మరోసారి చరిత్రను పలకరించింది.
ప్రైవేటు పరిశ్రమలకు ప్రభుత్వం ఎంత అనుకూలమో, ప్రజల అభిప్రాయాలకు స్వేచ్ఛనిచ్చే చంద్రబాబు ప్రభుత్వం ఈ సమయంలో నిర్బంధం చేసి ఉండి ఉంటే… విశాఖ ప్రజలు దాన్ని మనసుల్లో పెట్టుకొని, కుక్కర్ లెక్కన ఎన్నికల ఫలితాల్లో పేల్చేవారు. ఇలాంటి చైతన్యం… సీమలో లేదు. కడప, కర్నూలు ప్రజలు… కాలుష్యకారక సిమెంటు కంపెనీల మధ్య జీవిస్తూ, ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి, ఆదాయాన్ని జగన్ కుటుంబానికి సమకూర్చే దుస్థితిలో ఉన్నారు.
విశాఖ ప్రజలు మాత్రం… సౌమ్యంగా, తెలివిగా, రాజకీయంగా, సామాజికంగా… తమ సమస్యలపై స్పందించగలిగే శక్తిని చాటారు. వాళ్ల పోరాటం… ఓ మేలుకొలుపు.