– బిఆర్ఎస్ నాయకుల అరెస్టులను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ – బిజెపికి మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలైంది. బిజెపికి ఒక న్యాయం.? బిఆర్ఎస్ కు ఒక న్యాయమా?
గంటల పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి నిరసన తెలియచేస్తూంటే అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ నాయకులను మాత్రం అరెస్టు చేయడం దుర్మార్గం. వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయాలు పక్కనబెట్టి ముందు విద్యార్థుల సమస్య పరిష్కరించడంపై దృష్టి పెట్టండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆపండి.