– ఎంపీ సానా సతీష్ లవ్ స్టోరీ
కాపు యువ ఎంపి సానా సతీష్ బాబు ప్రేమ కథ ఇంతవరకూ ఎవ్వరికీ తెలియదు. మంత్రి నారా లోకేష్ ఆత్మీయ కలయికలో ప్రేమ కథను కదిపారు. అప్పుడు అసలు ట్విస్ట్ బయటపడింది. తాను ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ తరువాత మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. అప్పుడు అసలు విషయం విడమరిచి చెప్పారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్ మ్యారేజ్ కోసం వెళ్లామని, అయితే ఏదో ఒక గుడిలో పెళ్లి చేసుకుని ఫోటోలు తీసుకురావాలని చెప్పడంతో, ముందుగా గుడిలో సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాం. ఆ తరువాత రిజిస్టర్ ఆఫీసులో చట్టబద్ధమైన వివాహం జరిగింది. పెద్దలను ఒప్పించాక, కుటుంబాలను పిలిచి మళ్లీ పెళ్లి చేసుకున్నామని చెప్పడంతో …ఒక్క ప్రేమని గెలిపించడానికి మూడుసార్లు పెళ్లి చేసుకున్న అసలు సంగతి విడమరిచి చెప్పారు.