Suryaa.co.in

Andhra Pradesh

వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలి

– నిరంతరం ఎన్నికలు జరుగుతుంటే మంచి పాలన ఉండదు
– మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు

విజయవాడ: అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నికపై చర్చ జరుగుతుంది. పదవీ విరమణ చేశా. కానీ పెదవి విరమణ చేయలేదు. ప్రజల ఆకాంక్ష మేరకు నాకు నచ్చిన అభిప్రాయాలని యువతరానికి తెలియచేస్తాను. ఒకే దేశం ఒకే ఎన్నికలు సమర్థవంతంగా జరగాలి.

కొందరు వ్యతిరేకించేవారు ఉంటారు. వాటి మీద అవగాహన కి రావాలి. లోక్ సభకి శాసన సభకి ఒకే సారి ఎన్నికలు జరగాలి. ఇది కొత్త కోరిక కాదు మోదీ నిర్ణయం కాదు.1952 లో సాధారణ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1957,1962,67 లో ఇలా ఒకేసారి జరిగాయి. ఇందిరా గాంధీ,నెహ్రూ లు ప్రధాని ఉన్నప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి.1985 లో రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరొకసారి ఎన్నికలు వెళ్దాం అన్నారు. ఇందిరా హత్య అనంతరం కాంగ్రెస్ ఎన్నికల్లోకి వెళ్లాయి.

రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సమర్థవంతంగా పరిపాలించే వారికి తప్పకుండ ప్రజలు నిలబడతారు. అంతే కానీ ఈ జమిలి వస్తే బీజేపీ కి అనుకూలంగా ఉంటది అని కొన్ని పార్టీ లు అపోహ పడుతున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే సమైక్య స్ఫూర్తి దెబ్బ తీస్తుంది. ప్రాంతీయ పార్టీ లు నష్టపోతాయనడంలో పస లేదు.

అసెంబ్లీలు రద్దు చేయటంలో మధ్యలో ఎన్నికలు నిర్వహించడం తో ఒకే దేశం ఒకే ఎన్నికలు దారి తప్పాయి. అందుకే తిరిగి దేశం అభివృద్ధి చెందటంలో ప్రముఖ పాత్ర వహించే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగాలి. నిరంతరం ఎన్నికలు జరుగుతుంటే మంచి పాలన ఉండదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశ భవిష్యత్తుని ముందుకి తీసుకెళ్ళేది. అభివృద్ధిని వేగవంతం చేసేది.

ఖర్చు తగ్గుతుంది మ్యాన్ పవర్ సర్దుబాటు జరుగుతుంది. పాలన సజావుగా కొనసాగుతుంది. సంక్షేమం అభివృద్ధి సమానంగా రాష్ట్రాలు ప్రజలకి సుపరిపాలన అందించగలదు. ఏదొక రాష్ట్రాలు ఎలక్షన్ మోడ్ లో ఉంటే ప్రజా పాలన కి ఆటంకాలు ఏర్పడతాయి. ఎన్నికలు కోడ్ అమలులోకి వస్తుంది దీనితో సంక్షేమ పథకాలు అభివృద్ధి వెనక పడుతుంది. పార్లమెంట్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు ఒకేసారి జరిగితే మంచి పాలన తో పాటు దేశ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో పాటు పార్టీ ఫిరాయింపులపై కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి.

LEAVE A RESPONSE