Suryaa.co.in

Andhra Pradesh

రైలు ప్రమాదం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

విజయనగరం: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో నిన్న రాత్రి జ‌రిగిన రైలు ప్ర‌మాదంలో 14 మంది మృతి చెంద‌గా 100మందికి గాయాలైనట్లు తెలిసింది,మృతుల్లో లోకో పైలేట్ రావు, ట్రైన్‌గార్డ్ ఉండ‌గా ఆసుప‌త్రిలో మ‌రో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. విశాఖ‌-ప‌లాస ప్యాసింజ‌ర్‌ను ఢీకొన్న విశాఖ‌-రాయ‌గ‌డ రైలు ప్ర‌మాదంలో ప‌ట్టాలు 5 బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఘ‌ట‌న స్థ‌లంలో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంది.

ఈ విషయం తెలియగానే అక్కడికి స్థానికులు వేల మంది వచ్చారు. వారిలో కొందరు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. మరికొందరు సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలూ తీసుకుంటున్నారు.

దీని వల్ల టెక్నికల్ సమస్యలు రావచ్చని భావిస్తున్న రైల్వే శాఖ అధికారులు.. అక్కడికి బయటివారెవరూ రావొద్దని కోరుతున్నారు. ఇది చాలా సున్నితమైన, విషాదకరమైన సంఘటన అని మాకు తెలుసని, మా సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, దయచేసి రెస్క్యూ ఆపరేషన్ల ప్రాంతంలోకి ప్రవేశించవద్దన్నారు.

అలా వస్తే, పనులకు ఆటంకం ఏర్పడుతుందని, మేము రైళ్లను సాధారణ స్థితికి తెచ్చేందుకు, పునరుద్ధరించేందుకు కష్టమవుతుంది. దయచేసి ఈ కీలక సమయంలో రైల్వేలను అర్థం చేసుకుని, సహకరించండి అని అధికారులు కోరారు.

LEAVE A RESPONSE