( చాకిరేవు)
ఏడిపించే ఉల్లి అని అలా తొక్కి ఏడిపించకండి జగన్ గారూ?
క్వింటాల్ ఉల్లి ఇప్పుడు ₹1200/-. అలా తొక్కకండి రెడ్డి గారూ…
మీరు ఈ ఉల్లి ధరలు చూసి ఆవేదన పడుతుంటే.. రాష్ట్రం కాదు, ఉల్లిపాయలే ఏడుస్తున్నాయి.
* * *
జగన్ గారి డ్రామా: ఎపిసోడ్ – ఉల్లి కన్నీళ్లు
సింహాసనం పోయినా,
ఈయన డ్రామాలు మాత్రం వీడలేదు. “ఉల్లి ధరలు పెరిగాయి!” అని జగన్ గారు ఏడుస్తుంటే, ప్రజలు మాత్రం అంటున్నారు.. “మీ హయాంలో క్వింటా ₹150కి వచ్చినా కొనలేదని తగలెట్టారు ఉల్లి రైతులు. మద్దతు ధర ₹770 పైగా వుందని ఉల్లిపాయలు ఏడుస్తున్నాయి. మా ర్కెట్లో కొనకుండా వదిలేశారు”
ఇప్పుడు?
చంద్రబాబు గారు వచ్చాక… పులివెందులలో కూడా జగన్ గారి డిపాజిట్లు ఉల్లిపాయల పొట్టు ఊడి పోయినట్లు పోయాయి.
ట్రేడర్లు ₹5 ₹6 అడిగినా, రైతు నష్టపోకూడదని ₹1200 ఇచ్చి కొనిపిస్తున్న ఘనత బాబుగారిది. ఇది మద్దతు ధర కాదు – ఉల్లి రైతుకు చేసిన మేలు.
జగన్ గారి కన్నీళ్లు x రైతుల ఆనందం
అప్పుడు “మద్దతు ధర” అని జగన్ రైతులకు కన్నీళ్లు మిగిల్చారు. ఇప్పుడు “ఆదుకుంటున్నాం” అని చంద్రబాబు రైతుల కళ్లలో వెలుగు నింపుతున్నారు.
జగన్ ధర పెరిందని ఏడుస్తున్నారు, ఇంకొకరు ఏడుపు తుడుస్తున్నారు. ఇది కేవలం ఉల్లి రైతుల కోసమే కాదు, ఇది ఆంధ్రుల భవిష్యత్తు కోసం.
పంట తొక్కినవారు, ప్రజల నమ్మకాన్ని కూడా తొక్కారు. పొగాకు, మామిడి, ఉల్లి…
పంటలు ఏదైనా ఇలా పట్టుకొచ్చి తొక్కడం ట్రాక్టర్లతో తొక్కించడం చూసి తాజాగా కడకు కడపలో కూడా తొక్కించుకుంటున్నారు.
ఇలా వైకాపా పెయిడ్ ఆర్టిస్టులతో పంట పొలాల్లో నాటకం వేస్తే, జగన్ గారు… మీ కన్నీళ్లు మాకు అర్థమవుతున్నాయి.
అప్పుడు తక్కువ ధర ఇచ్చిన బాధ,
ఇప్పుడు పదకొండు స్థానాల్లో తన్నుకు వచ్చిన బాధ!
ఉల్లి ధరలు పెరిగితే మీరు ఏడ్చినా,
రైతులకు మేలు జరుగుతోందని మాత్రం మరవకండి.
మీరు మారరు.
అదే ఆంధ్రాకు మంచిది, జగన్ గారు.