– జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో మహిళలపై జరిగిన దారుణాలపై ప్రత్యేక పుస్తకం విడుదలచేసిన తెలుగుదేశం
పుస్తకావిష్కరణ కార్యక్రమం వివరాలు, నేతల ప్రసంగం వివరాలు ….
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని జగమెరిగిన సత్యమని, తామురాజకీయ ఉద్దేశంతో ఇలా మాట్లాడటంలేదని, రాష్ట్రంలో మహిళలు, చిన్నా రులపై జరుగుతున్న అఘాయిత్యాల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1 స్థానంలోఉందని, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన ‘జగన్ పాలనలో ఊరికో ఉన్మాది-మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మహిళలపై జరుగుతున్న దాష్టీకాలజాబితాలో ఏపీదేశంలోనే తొలిస్థానంలో నిలిచిందంటే అందుకు కారణం జగన్ రెడ్డి పాలనే. చంద్రబాబుగారి హయాంలో ఇదేఅంశంలో రాష్ర్ట్రం 10వ స్థానంలో నిలిచింది. రాష్ట్రానికి ఇలాంటిగొప్ప ర్యాంకువచ్చినందుకు నిజంగా ఆంధ్రాపౌరులుగా అందరంబాధపడాలి. మరీముఖ్యంగా రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి… ఆయన ప్రభుత్వంలోనివారు, వైసీపీపెద్దలు, ఆపార్టీనేతలంతా సిగ్గుతో తలదించుకోవాలి. మూడేళ్ల జగన్ రెడ్డిపాలనలో ఘోరాతిఘోరంగా ఆడబిడ్డలపై 800వరకు అఘాయిత్యాలు జరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరత్రా ఏకులంవారైనా సరే, వారు..వీరూఅనిలేకుండా ఆడపు ట్టుక పుట్టినవారంతా దుర్మార్గుల కర్కశత్వానికి బలయ్యారు.
దుర్మార్గులు, దుష్టుల జాబితా లోసాధారణ పౌరులుండటం ఒకఎత్తు.కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే అధికా ర పార్టీ వారే ఎక్కువగా ఉండటం. అదికూడా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలే ఏకంగా మహి ళలతో అసభ్యంగా మాట్లాడిన ఘటనలు మనంచూశాం. జగన్ రెడ్డి మానసపుత్రులైన వాలం టీర్లు మహిళలపై దురాగతాలకుపాల్పడిన వారిలో అగ్రస్థానంలోఉండటం కొసమెరుపు.
జగన్ రెడ్డి పాలనలో ఊరికొక ఉన్మాది, ఊరికొక కాలకేయుడు ఉన్నాడన్నది నిజమా..కాదా? తమప్రశ్నలపై ముఖ్యమంత్రి నోరువిప్పాల్సిందే.మొన్నటికి మొన్న విజయవాడ పాతప్రభుత్వాసుపత్రిలో మానసిక దివ్యాంగురాలిని బంధించి, 30గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.ముగ్గురు దుర్మార్గులు ఇంతటి దురా గతానికి పాల్పడితే, దానిపై టీడీపీ స్పందిస్తే, దాన్ని రాజకీయం చేస్తున్నామంటున్నారు.
రాష్ట్రమహిళా కమిషన్ తమతీరుని, తమ అధినేతను తప్పుపడుతూ, నోటీసులిచ్చింది. అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన తమకు నోటీసులు ఇచ్చే అధికారం మహిళాకమిషన్ కు లేదమ్మా అంటున్నాకూడా సదరు కమిషన్ ఛైర్ పర్సన్ తలకుఎక్కిం చుకోవడంలేదు. బయటకు వచ్చిన ఏ ఆడబిడ్డ అయినా, స్వేచ్ఛగా తిరిగి ఇంటికివెళ్లే పరిస్థి తి ఈ రాష్ట్రంలోఉందా అని ప్రశ్నిస్తున్నాం.
జగన్ రెడ్డి అమ్ముతున్న పిచ్చిమద్యం, జేబ్ర్రాండ్ మద్యంతాగిన ఉన్మాదులు, పిచ్చివాళ్లు, సైకోలు, బ్లేడ్ బ్యాచ్ లు, గంజాయి బ్యాచ్ లు రాష్ట్రం లో విచ్చలవిడిగా మానవమృగాల్లా ఆడవాళ్లపై పడుతుంటే ఈప్రభుత్వం ఏంచేస్తోంది?
ఇటీవల విడుదలైన జాతీయస్థాయిసర్వేనివేదికలో మహిళలను వేధింపులకు గురిచేసినవారి జాబితాలో వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఆపార్టీవారు అధికంగా ఉన్నారని తేలింది.
రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరుగుతున్న దాష్టీకాలగురించి మేం మాట్లాడటంకాదు.. అధికారపార్టీ కిచెందిన ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు, ఇతరత్రా నేతలపై ఉన్న కేసులజాబితానే అందుకు నిదర్శనం.
వైసీపీప్రజాప్రతినిధులు వారిపై ఉన్న కేసులజాబితా….
1. వైసీపీఎంపీ గోరంట్ల మాధవ్ పై : హిందూపూర్ లో సెక్షన్ 367 నమోదైంది.
2. వైసీపీఎంపీ మార్గాని భరత్ పై : సెక్షన్ 497..
3. బెల్లాన చంద్రశేఖర్ పై : విజయనగరంలో సెక్షన్ 354…
4. వైసీపీఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై : ఐపీసీ సెక్షన్ 354…
5. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై : తంబళ్లపల్లిలో ఐపీసీ సెక్షన్ 354..
6. వైసీపీఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై : మాచర్లలో సెక్షన్ 354,
7. కేతిరెడ్డి రామచంద్రారెడ్డిపై : ధర్మవరంలో సెక్షన్ 509..
వీరందరితోపాటు, మొన్ననే కేబినెట్ నుంచి బయటకువెళ్లిన అరగంట మంత్రి ఒకరుఉన్నారు. ఆయన మహిళతో మాట్లాడిన విధానం అందరంచూశాము. అలానే సంజన వ్యవహారంతో ఇప్పుడు కేబినెట్లో మంత్రిగా ఉన్నఅంబటిరాంబాబుకి ఉన్న సంబంధంఏమిటో కూడా అందరికీ తెలిసిందే.
ఇలా ఈ జాబితా చాంతాడంతఉంది. గుంటూరులో అయితే ఏకంగా అధికారపార్టీకిచెందిన ఛైర్మన్ గా ఉన్నవ్యక్తి అయితే, గుంటూరులో ఒకమహిళను కిడ్నాప్ చేయించి, నెలరోజులు తనవద్దనే ఉంచుకున్నాడు.
అతనితోపాటు, సుమారు 70మంది ఘోరాతిఘోరంగా సదరు మహిళపై బలాత్కారానికి పాల్పడ్డారు. గుంటూరుజిల్లా నకరికల్లులో అయితే ఏకంగా వైసీపీ నేత ఒకడు తనకు ఇవ్వాల్సిన బాకీచెల్లించలేదన్న అక్కసుతో గిరిజనమహిళను ఏకంగా ట్రాక్టర్ తో తొక్కించేశాడు. అతనిపై ఈ ప్రభుత్వంలోఎలాంటి చర్యలులేవు. ఇలా ఊరికో ఉన్మాది జాబితాలో 800మంది వరకుఉన్నారు.
ఇలా జరుగుతుంటే మీరేంచేస్తున్నారు.. మీ ప్రభుత్వం ఏంచేస్తుందని తాము ప్రశ్నిస్తే తమకు మహిళాకమిషన్ పేరుతో నోటీసులు. మహిళాకమిషన్ రూల్స్ బుక్ లో ఎవరికి నోటీసులు ఇవ్వాలి..ఏ సమయంలోఇవ్వాలనే నిబంధనలు కచ్చితంగాఉంటాయి. అవేవీ ఇప్పుడున్న వారికి తెలియనట్లుగాఉంది. మహిళలను వేధించినవారికి, వారిపై ఏరకమైన హింసకు పాల్పడినా….దాన్ని ప్రోత్సహించినా.. అలాంటివారికి మాత్రమే నోటీసులు ఇవ్వాలి.
తాడేపల్లి ఆదేశాలప్రకారమే రాష్ట్రమహిళాకమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మా నాయకుడి కి , నాకునోటీసులు ఇచ్చారు. విజయవాడలో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారంజరిగితే బాధితురాలిని పరామర్శించడానికి తమఅధినేత చంద్రబాబుగారు, తాము వెళితే, వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకొని అప్పటికప్పుడు అక్కడకువచ్చి వీరంగంవేసి, తనను ఏదో అన్నామం టూ నానాయాగీచేసింది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం.
చంద్రబాబు బాధితు రాలి వద్దకు వెళ్లకుండా ఉంటే ఈప్రభుత్వం అసలు ఆ దారుణాన్ని పట్టించుకునేదా? అత్యాచా రం జరిగి మూడురోజులైనా అప్పటివరకు ఈ ప్రభుత్వం, మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ , వైసీపీ మహిళానేతలు ఎందుకు ఆమెముఖం చూడలేదు? సంఘటనజరిగిన విజయవాడకు కూతవేటుదూరంలోనే ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉండి ఏం చేశారు?
30గంటలపాటు ప్రభుత్వానికి సంబంధించిన భవనంలో అభాగ్యురాలిపై అత్యాచారం జరిగితే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏంచేశారని ప్రశ్నిస్తే దానికే మాకు నోటీసులు ఇస్తారా?
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా ఉన్నవ్యక్తి తనను పట్టుకొని అరేయ్.. ఒరేయ్ అనడం భావ్య మా? ఆమెస్థాయికి తగినట్లుగా ఆమెభాష, ప్రవర్తన లేదు. అత్యాచారం జరిగిన తరువాత తాపీగా వచ్చిన మహిళాహోంమంత్రికి అసలు ఘటనగురించేతెలియదు. ఎప్పుడుజరిగింది.. ఎలా జరిగింది…ఏమైంది అంటూ ఆమె మీడియానుప్రశ్నించడం సిగ్గుచేటు. అదీ ఈ ప్రభుత్వ పనితీరు. కనీసఅవగాహన లేని వారంతా ఈప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.
మహిళలపై దుర్మార్గాలకు పాల్పడిన వైసీపీకాలకేయలుజాబితాను విడుదలచేశాం. దానిపై ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? మహిళాకమిషన్ ఎలా స్పందించబోతోంది?మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ గాఉండి ఎవరికి,ఏ సందర్భంలో నోటీసులు ఇవ్వాలో కూడా ఆమెకు తెలియకపోవడం సిగ్గుచేటు. తన ఫోటో ఫోజుల కోసం అత్యాచార బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను వాసిరెడ్డిపద్మ నానాయాగీ చేసింది. తమను పట్టుకొని అంత హడావుడి చేసిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఈ 800ఘటనలపై, వైసీపీ కాలకేయుల దురాగతాలపై ఏం సమాధానంచెబుతుంది? వారికి కూడానోటీసులిచ్చి శిక్షిస్తుందా? ఆమెకు, ఆమె కమిషన్ కు అంతధైర్యంఉందా? మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ అయ్యాక ఆమెఎంతమందికి ఉరిశిక్షలు వేయించి, ఎందరికి నోటీసులిచ్చి విచారించింది? చంద్రబాబుగారి హాయాంలో పల్నాడులో ఒకడు అత్యాచారానికి పాల్పడితే, కాల్చిపడేయమన్నారు. 21రోజుల్లో తేల్చేసి, వారంలో శిక్ష వేస్తామన్న దిశాచట్టం ఎక్కడుంది?
తాము విడుదల చేసిన 800ఘటనల్లో ఎందరిని దిశాచట్టంతో ఈ ప్రభుత్వం శిక్షించింది? ఎంతమందికి ముఖ్యమంత్రి శిక్షలు వేయించాడు?ప్రశ్నించేవారిపై ఎదురుదాడిచేస్తూ, వేధిస్తూ, అధికారంఉందన్న కండకావరంతో, అధికార మదంతో ఇష్టానుసారం మాట్లాడటంకాదు. ముఖ్యమంత్రి ఇంటిపక్కనే సీతానగరంలో కాబోయే భర్తతో బయటకువెళ్లినయువతిపై అత్యాచారం చేసిన వెంకటరెడ్డిని ఈ ప్రభుత్వం శిక్షించిందా? కాలకేయుల జాబితాపై ముఖ్యమంత్రి, హోం మంత్రి సమాధానంచెప్పాలి.వైసీపీనేతల కాముకత్వంపై, వారిపై ఉన్న కేసులపై ముఖ్యమంత్రి నోరువిప్పరా? తన మూడేళ్లపాలనలో మహిళలజోలికి వెళ్లిన ఒక్కడినైనా జగన్మోహన్ రెడ్డి శిక్షించాడా?
రాష్ట్రం రావణకాష్టంగా మారడానికి,పశుప్రవృత్తితో పేట్రేగిపోవడానికి ముఖ్యమంత్రి చేతగానితనం,ప్రభుత్వ ఉదాసీనతే కారణం. దానిఫలితమే రాష్ట్రంలోనిత్యం ఏదోఒకమూలనఆడబిడ్డల పై జరుగుతున్న దారుణాలు. విజయవాడలో మానసికదివ్యాంగురాలిపై అత్యాచారం జరిగిన తరువాతిరోజే కంచికచర్లలో ఒకదారుణం.. తరువాతరోజు కృష్ణాజిల్లా తిరువూరులో మరోదారుణం. మానవమృగాలకు వైసీపీప్రభుత్వం కొమ్ముకాస్తుండబట్టే రాష్ట్రంలో ఆడబిడ్డల కు రక్షణలేకుండాపోయింది. ఈ దురాగతాలను నిరసిస్తూ,మహిళల పక్షాన వారికి న్యాయంచేయడంకోసం తాము, తమపార్టీ ఉద్యమించబోతోంది. రేపు (27వతేదీన) రాష్ట్రవ్యాప్తంగా అన్నినియోజకవర్గకేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టబోతున్నాం.
దిశలేని దిశాచట్టంతో ఉపయోగంలేదని..గన్ కంటే ముందుగా వచ్చే జగన్ ఏమైందని ప్రశ్నిస్తున్నాం. టీడీపీ అధినేతచంద్రబాబు తాము విజయవాడవెళ్లి అత్యాచారబాధితురాలిని పరామర్శించకపోయి ఉంటే ఈప్రభుత్వానికి ఆ దుర్మార్గం కనిపించి ఉండేదికాదు. మహిళాకమిషన్ స్పందించేదే కాదు. మహిళలపై జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వం స్పందించి, దోషులను శిక్షించి ఆడబిడ్డలకు న్యాయంచేసేవరకు తమపోరాటం ఆగదని స్పష్టంచేస్తున్నాం. మహిళలభద్రతకోసం తెలుగుదేశంపార్టీ ఎంతదూరమైనా వెళుతుందని తేల్చిచెబుతున్నాం.
ముఖ్యమంత్రి మాపై తప్పుడుకేసులుపెట్టినా, జైలుకుపంపినా… తగ్గేదేలేదు. చట్టబద్ధత లేకుండా ఇచ్చినా నోటీసులకు స్పందించేదే లేదు.. అసలు ఆ నోటీసుల్ని పరిగణనలోకే తీసుకోము. వాటికి స్పందిస్తే ప్రతిఒక్కరూ అదేపంథాలో బెదిరింపులకు పాల్పడుతూనే ఉంటారు. ఈరోజుకూడా తిరువూరులోని ప్రభుత్వకళాశాలలో ఒక విద్యార్థినిపట్ల, అక్కడి అధ్యాపకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అతనిపై ఫిర్యాదుచేసినా కళాశాల ప్రిన్సిపల్ స్పందించలేదు.
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
అక్కచెల్లెమ్మలు..అక్కచెల్లెమ్మలు అంటూ సెంటిమెంట్ తో ఓట్లుదండుకొని ముఖ్యమంత్రి అయ్యాక సొంతచెల్లికే న్యాయంచేయలేని చేతగానివ్యక్తిపాలనలో ఆడబిడ్డల పరిస్థితిఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేతగానివ్యక్తి అసమర్థపాలనకు టీడీపీ విడుదల చేసిన పుస్తకమే పెద్దనిదర్శనం. సాటిమహిళగా ఇలాంటి పుస్తకం విడుదలచేసే పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. ఏ ముఖ్యమంత్రి అయినా కనీసంలో కనీసంగా కాస్తైనా మహిళ ల గురించి మాట్లాడతాడు. ఒకసారికాకపోతే ఇంకోసారి అయినా ఆడబిడ్డలకు న్యాయం చేయాలని చూస్తాడు.
కానీ ఈ ముఖ్యమంత్రి ఏ ఆడబిడ్డకు ఏమైపోతే తనకేంటి.. ఎక్కడేం జరిగితే నాకేంటి అన్నట్లుగా నిమ్మకునీరెత్తినట్టుగా ఉంటున్నాడు. అత్యాచారంజరిగినా.. హత్యజరిగినా తనకు ఏంనష్టముంది.. గడిచిపోతోందిలే అన్నట్లుగా జగన్ రెడ్డి తీరుఉంది. రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారంజరిగితే నాకేంటి..ఏ ఆడబిడ్డ ఏమైపోతే తనకేంటి అంటున్న ముఖ్యమంత్రి తీరు ఇక్కడే చూస్తున్నాం. రాష్ట్రంలో ఆడబిడ్డల మానానికి ఒకరేటు.. ప్రాణానికి ఒకరేటు నడుస్తోందని అసలు ముఖ్యమంత్రికి తెలుసా? డబ్బులిచ్చి అత్యాచారబాధితుల నోళ్లు మూయించేచర్యలు ఎంతకాలం చేస్తారు ముఖ్యమంత్రి గారు?
బీసీమహిళపై అత్యాచారంజరిగితే పదిలక్షలు, దళితమహిళకుఅన్యాయం జరిగితే రూ.5లక్షలుఇస్తూ.. మానప్రాణాలను కూడా విభజించి…విలువ కడుతున్న పైశాచికపాలనను చూస్తున్నాం. మహిళలపై జరిగిన 800లకు పైగా దురాగతాల పుస్తకాన్ని ఒక ఆడబిడ్డగా విడుదల చేస్తున్నందుకు చాలాచాలా బాధపడుతున్నాను. మూడేళ్ల జగన్ రెడ్డిపాలనలో పేట్రేగిపోతున్న సైకోలు, దుర్మార్గుల గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. ఆడబిడ్డలకు న్యాయం చేయండి అని ప్రశ్నించిన చంద్రబాబుగారిపైకి మరోపావుని ఉపయోగించిన జగన్ రెడ్డి సైకోయిజం పీక్స్ కి వెళ్లిందనే చెప్పాలి.
తన ప్రభుత్వంలోని మహిళను అడ్డుపెట్టుకొని, ప్రతిపక్షనేతపై దుష్ప్రచారానికి పాల్పడటం ఈ ముఖ్యమంత్రికే చెల్లింది. 30గంటలపాటు ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారంజరుగుతుంటే వైసీపీప్రభుత్వ నిఘా వ్యవస్థ ఏంచేసింది? చంద్రబాబుగారు బాధితురాలిని పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి ఫోటోలకుఫోజులిస్తూ.. మంచినీళ్లు తాగిస్తూ మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ నాటకాలు ఆడింది. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినవ్యక్తిని పట్టుకొని మీకేంపని…ఇక్కడకు ఎందుకువచ్చారని ఆమె ప్రశ్నించడం సిగ్గుచేటు.
తాతకుదగ్గులు నేర్పినట్టు..ఆమె చంద్రబాబుగారికి మహిళాకమిషన్ నిబంధనల గురించి చెప్పడం సిగ్గుచేటు. మహిళా కమిషన్ అధికారాలు..నిబంధనలన్నీ చంద్రబాబు హాయాంలో రూపొందించినవే అని వాసిరెడ్డిపద్మకు తెలియకపోవడం ఆమెలోని అజ్ఞానానికి నిదర్శనం. ఎవరో తాడేపల్లిలో కూర్చున్న దద్దమ్మలుచెబితే ఆమె దద్దమ్మలా నోటీసులు ఇస్తుందా? విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన దారుణంలో మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ వేసిన డాన్సింగ్ లను ప్రజలంతా గమనించారు. పద్మ డాన్సింగ్ లప్రభావమే మానసిక దివ్యాంగురాలిపై జరిగిన అత్యాచారం ఘటనను ప్రజలు మర్చిపోయేలా చేసింది. అత్యాచారం చేసిన వెధవనాకొడుకుల్ని వదిలేసి, చంద్రబాబుగారికినోటీసులిచ్చాము.. బొండా ఉమాకి నోటీసులిచ్చాము.. వారు పరిగెత్తుకుంటూ రావాలంటే ఎలా?
తనకు ఏదో అవమానం జరిగిందని తారీఖులు కూడా చూడకుండా నోటీసులిచ్చిన పద్మకు రాష్ట్రంలో రికార్డైన 1500అత్యాచారాలు కనిపించలేదా? 1500వరకు అత్యాచారాలుజరిగితే వారికి నిందితులకు నోటీసులివ్వాలని పద్మకు అనిపించలేదా? దురాగతాలకు పాల్పడిన వారికి నోటీసులిచ్చే ధైర్యం ఆమెకు, సైకోలను శిక్షించే ధైర్యం ఈ చేతగాని ముఖ్యమంత్రికి లేదా? తాము విడుదలచేసిన పుస్తకంలో ఒక్కసంఘటన అబద్ధమని ముఖ్యమంత్రి నిరూపించినా.. తాము రాజకీయసన్యాసం తీసుకుంటాము.
కరోనాస మయంలో తల్లిని కోల్పోయిన 14ఏళ్లబాలికపై 80మంది సైకోగాళ్లు నెలన్నరపాటు ఆకృత్యానికి పాల్పడితే చిన్నారిని చూడటానికి మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ ఎందుకు వెళ్లలేదు? 80 మంది దుర్మార్గులకు పద్మగారు ఎందుకునోటీసులు ఇవ్వలేదు… వారంతా వైసీపీనేతలనా? డైవర్ట్ రాజకీయాలకోసమే విజయవాడ అత్యాచారఘటనలో మహిళాకమిషన్ చంద్రబాబుగారికి నోటీసులిచ్చింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జలద్వారా నేరుగా హోంమంత్రికి స్క్రిప్ట్ రావడంలేదు.
ఎంతైనా కొత్తహోం మినిస్టర్ .. పాత రబ్బర్ స్టాంప్ కదా… బాగా ఆలస్యం అవుతోంది. లేకపోతే ఆమెకూడా ఈపాటికే నోరేసుకొని పడిపోయేది. చంద్రబాబుగారు చీరకట్టుకొని బొండాఉమాగారిని పంపించారని వాసిరెడ్డి పద్మ అంటున్నది. జగన్ రెడ్డికి ఆయన భార్యభారతి చీరలు సరిపోవడంలేదా..లేక మీరుఏమైనా పంపిస్తున్నారా అని తాము ప్రశ్నిస్తున్నాం. తాడేపల్లి కొంపలో కూర్చొని ఆడబిడ్డలపై జరిగే దారుణాలను పట్టించుకోకుండా, చీరలుకట్టుకొనే రాజకీయాలు చేస్తున్నారని తాము అనగలం. ఈ ప్రభుత్వంలో ఊరికొకచెత్తనాకొడుకు తయారయ్యాడు. ముఖ్యమంత్రిపైనే కేసులున్నాయి.. తమపై ఉంటే ఏమవుతుంది అంటున్నారు.
పులివెందుల నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం జరిగితే జగన్ రెడ్డి ఏంచేశాడు? నిందితులను శిక్షించలేని సీఎం అసలు ముఖ్యమంత్రి స్థానంలోకూర్చోవడమెందుకు? అనూషఅనే అమ్మాయిని అతికిరాతకంగా వైసీపీనేత హతమారిస్తే ఏంచేశారు? అనూషను, రమ్యను చంపినవాళ్లంతా దర్జాగా బెయిల్ పై బయటకు వచ్చి తిరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి ఏంచేస్తున్నాడు?
మీరు ఇచ్చిన నోటీసులు మాకు వెంట్రుకతో సమానమని మేం చెప్పగలం. కానీ చంద్రబాబుగారు మాకునేర్పిన సభ్యత సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని గుర్తుంచుకోండి. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు ఘోరాలకు యథాలీడర్ తథాకేడర్ స్లోగన్ కచ్చితంగా సరిపోతుంది.
నేను ఎమ్మెల్యే మనిషిని..నేను మంత్రిగారి తాలూకా అనేవాళ్లే ఆడబిడ్డలపై ఎక్కువగా దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నిజంగా మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ గా ఉన్న ఆమె అలాంటివారిని శిక్షించి, ఆమెఉన్న స్థానానికి పేరుప్రతిష్టలు తీసుకొస్తే అప్పుడు ఒప్పుకుంటాము.. మహిళాకమిషన్ కు సర్వాధికారాలు ఉంటాయని. చంద్రబాబుగారికి, బొండా ఉమాగారికి ఇతరులకు నోటీసులు ఇస్తే.. ఒరిగేదేమీ లేదని గుర్తుంచుకోండి. వైసీపీప్రభుత్వంలో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరులే అని రెచ్చి పోతున్న సైకోగాళ్లంతా ఇప్పుడుతప్పించుకోవచ్చులే గానీ… రేపు వచ్చే చంద్రబాబుగారి ప్రభుత్వంనుంచి తప్పించుకోలేరు.
ఈ విషయం మానవత్వం లేకుండా మృగంలా ప్రవర్తించే ప్రతిఒక్కరూ గుర్తుంచుకోండని హెచ్చరిస్తున్నాను. చేసిన తప్పులకు ప్రతిఒక్కడూ ఎక్కడున్నా శిక్ష అనుభవించాల్సిందే. ఆడవాళ్లకోసం తాము పోరాడితే అది తప్పెలా అవుతుంది. మూడేళ్లపాటు పట్టించుకోనివారు… చంద్రబాబుగారు బయటకు వస్తే నోటీసులిస్తారా? దానికి సమాధానంచెప్పరేం. మహిళలపై జరుగుతున్న దురాగతాలకు ఈముఖ్యమంత్రి…ప్రభుత్వం ఎప్పుడు ముగింపుపలుకుతుందని ప్రశ్నిస్తున్నాం. టీడీపీ నిరసన కార్యక్రమాలు ఆడబిడ్డలకోసం. అవి నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి. కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది మాకుకాదు.. వైసీపీలో ఉంటూ మహిళలపై దారుణాలకు పాల్పడుతున్న ప్రతిఒక్కరికీ మహిళాకమిషన్ కౌన్సిలింగ్ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఆ విషయం పద్మగారు తెలుసుకుంటే మంచిది.
రాాష్ట్ర మహిళాకమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ రాజ్యలక్ష్మి
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో… అక్కడ దేవతలు నర్తిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో స్త్రీలు పూజింపబడటంలేదుసరికదా.. మహిళల మానప్రాణాలకు రక్షణలేకుండా పోయింది. రాష్ట్రంలో పట్టపగలే మహిళలు, చిన్నారులు, 80ఏళ్ల ముదుసలి వరకు రోడ్లపైన తిరగలేని దుస్థితి. అత్యాచారబాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుగారు, బొండాఉమాగారికి నోటీసులివ్వడం.. అదీ ఒకసాధారణ సెక్షన్ ఆఫీసర్ తో నోటీసులు పంపడం పూర్తిగా మహిళాకమిషన్ నిబందనలకు విరుద్ధం.
మహిళాకమిషన్ చైర్ పర్సన్ ను ఏదైనా అన్నారని భావించినట్లయితే ఆమె నేరుగా వెళ్లి, వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయాలి. అలాకాకుండా తనను ఏదో అన్నారని మహిళలందరికీ బాధ్యతగా ఉండాల్సిన కమిషన్ ను రోడ్డుపైకి లాగడం భావ్యమాఅని ఆమెను ప్రశ్నిస్తున్నాం. సగంసగం అధికారాలుఉపయోగించి..మహిళాకమిషన్ పేరుతో నోటీసులివ్వడం..ముమ్మాటికీ కోర్టుఆదేశాలను ధిక్కరించడమే. కోర్టులు మాత్రమే తప్పులకు శిక్షలు వేస్తాయిగానీ.. మహిళాకమిషన్ కు అలాంటి అధికారం లేనే లేదు.
వాసిరెడ్డి పద్మగారు మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ గా సమాజానికి ఏంసందేశం ఇస్తున్నారో ఆమెనే ఆలోచించుకోవాలని కోరుతున్నాను. 10వతరగతి చదువుతున్న వైసీపీనేత కుమార్తెకు మార్కులు రావడం లేదని బాగాచదివే మరో అమ్మాయిని వేధించి చంపేస్తారా? ఆ ఘటనలో వైసీపీ నేతకు మహిళాకమిషన్ ఏం నోటీసులిచ్చింది? మహిళలకు రక్షణకల్పించలేని మహిళా కమిషన్ ఉన్నాఒకటే..లేకున్నా ఒకటే. తాముమహిళా కమిషన్ లో పనిచేసినప్పుడు ఎక్కడా ఎలాంటి తర,తమ బేధాలు లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాము.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలుగుమహిళ విభాగం గుంటూరు పార్లమెంట్ అధ్యక్షు రాలు అన్నాబత్తుని జయలక్ష్మి, విజయవాడ పార్లమెంట్ తెలుగుమహిళ అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి పాల్గొన్నారు.