Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడలో రెండో అన్న క్యాంటీన్ ప్రారంభం

  • అన్న క్యాంటీన్లలో ఆహారం కోసం క్యూ లైన్లలో బారులు తీరుతున్న ప్రజలు
  • పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు ఎంతగానో తోడ్పడుతున్నాయి
  • ఎన్డీఏ కూటమి నాయకులు

పేద ప్రజలకు ఉపయోగపడే అన్నా క్యాంటీన్ లను స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చి ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గుడివాడ పట్టణం ఏజీకే స్కూల్ సెంటర్లో టిడిపి రాష్ట్ర నాయకుడు కొనకల్ల బుల్లయ్య, మరియు ఎన్డీఏ పార్టీల నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి రెండవ అన్నా క్యాంటీన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి, టిడిపి నాయకులు ప్రజలకు అల్పాహారం వడ్డించారు….అనంతరం టోకెన్లు కొనుక్కొని ఎన్డీఏ కుటమీ నాయకులు అన్న క్యాంటీన్ లో అల్పాహారాన్ని రుచి చూశారు. అన్న క్యాంటీన్లో అల్పాహారం తినేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయం నుండే క్యూ లైన్లలో బారులు తీరారు.

గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లను రద్దు చేసిందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

రాజకీయాలకు అతీతంగా పేదలకు మంచి జరిగే కార్యక్రమాలు ఎవరు చేపట్టిన దాన్ని రద్దు చేయక కొనసాగించడం సాగించాలనీ, లేకుంటే జగన్ మాదిరి చరిత్ర హీనులుగా మిగిలిపోతారనీ ఎన్డీఏ కూటమీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం, జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మున్సిపల్ డి.ఈ ప్రవీణ్, బిజెపి నాయకులు అంగడాల సతీష్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గొర్జీ సత్యనారాయణ, లింగం ప్రసాద్,పోలాసి ఉమయ్య, కంచర్ల సుధాకర్, పొట్లూరి కృష్ణారావు, పలువురు టిడిపి – జనసేన – బిజెపి పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE