మన ప్రాచీన కళా వస్త్ర నైపుణ్యాలను ప్రోత్సహించాలి

-మార్కెట్లలో సోలార్ ఎనర్జి ప్యానల్స్ ఏర్పాటు చేయాలి
-సెక్రటేరియట్ లో తన శాఖలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం

టెక్స్ టైల్స్ కోసం ఉన్న కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.కేంద్ర నిధులను వాడుకోవాలి. ఆదాయం పెంచుకునేలా కార్పొరేషన్లను బలోపేతం చేయాలి. సంప్రదాయ బద్దంగా ఉన్న మన ప్రాచీన కళా వస్త్ర నైపుణ్యాలను ప్రోత్సహించాలి. గోల్కొండ షోరూం ల అభివృద్ధికి కృషి చెయ్యాలి

కోహెడ మార్కెట్ ను అత్యాధునిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేయాలి. దేశంలోనే బెస్ట్ మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం ఉన్న నిధులతో మొదటి దశలో మార్కెట్ లో కావాల్సిన వసతులు ఏర్పర్చుకోవాలి.

మార్కెట్లలో సోలార్ ఎనర్జి ప్యానల్స్ ఏర్పాటు చేయాలి.మార్కెట్ లోని వ్యర్థ పదార్థాలను కూడా సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి.శుభ్రత తో పాటు అన్ని సౌకర్యాలు మార్కెట్లలో ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల ఆదేశాలు. సహకార శాఖ పై కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Leave a Reply