లంకేయుల్లారా..
కనీసం మీకు స్పృహ, బుద్దీ, జ్ఞానం వుందా?
మీ అప్పు 51 బిలియన్ డాలర్లు మాత్రమే కదా.
అంటే 388597,30,50,000 రూపాయలు.
అక్షరాలా ముష్టి నాలుగు లక్షల కోట్ల రూపాయలు కూడా కాదు.
దానికే అలా దివాలా అని
రాజపక్సే దిగిపోవాలని
అలా గగ్గోలెత్తి భ్రష్టు పట్టిస్తున్నారే…
మీకు దండాలురా బాబులూ..
మా ఆంధ్రా ఇంటా & బయటా ఇవ్వాల్సింది 7 లక్షల కోట్ల పై మాట.
మేమెంత ఏడవాలి?
మా బటన్ రెడ్డిని మేమేమనాలి?
అప్పు తెచ్చి చిక్కీ మీద బొమ్మ వేసుకుని, మురిసిపోతూ.. నా పరిపాలన గురించి అసూయపడితే, గుండాగి టికెట్ తీసుకొంటారని, మీ పది తలకాయల రావాణాసురిడి కంటే భీకరంగా శపిస్తూ & బెదిరిస్తూ.. వెంట్రుకను కూడా పీకలేరనే మా రాజన్న తనయున్ని మేము గౌరవిస్తున్నట్లు, మీ రాజపక్సేని ఎందుకు గౌరవించరు?
అరె మీ దేశం అప్పులో 10 శాతం పైగా అవినీతితో అక్రమాస్తులు కూడబెట్టారని 11 చార్జ్ షీట్లు వున్నా.. మళ్లీ ఒక్క ఛాన్స్ ఇచ్చాము మేము.
మీరెందుకు అలా…
మిమ్మల్ని చూస్తుంటే మా ఆంధ్రాకు భయం వేస్తోంది.
-శ్రీనివాస్ మద్దినేని