నా చిన్నప్పుడు
బల్లెకు పోత పోత
బర్ల గాసే నాతోటి పిలగాడు
కోదాడ రాము ను
( వాళ్ళు కోదాడ నుంచి వచ్చిండ్రు కాబట్టి అదే వాళ్ళ ఇంటి పేరయ్యింది )
ఒక గొట్టు ప్రశ్న అడుగుదుము..
ఏమనంటే
తమ్మీ… కోదాడ రాము..
ఆరవై పెద్దదా..?
వోవ్వో…….
ఇరువై పెద్దదా..? అని
ఆరవై… అన్నప్పుడు నిమ్మళంగా…
ఇరవై అనే శబ్దం అనేదానికి ముందు..
వో….అని
కాంతారా సినిమా డైలాగు లెవల్లో దీర్ఘం తీస్తారికే…
ఆలోచనల బడేది ఒక నిమిషం.
అరవై పెద్దదా?
దీర్ఘం ఎక్కువ తీసిండ్రు కాబట్టి..
ఇరవై పెద్దదా..?
అనే ఆలోచనలో పడేటోడు కాసేపు
మా కోదాడ రామ్ తమ్ముడు.
అట్లా …. దీర్ఘం ఎక్కువ తీసిండ్రు కాబట్టి..వో ఇరువయ్యే పెద్దదే …అనే సమాధానం ఇచ్చేటోడు.
అందరం కలసి నవ్వుకుందుం.
…..…
సుప్రీం కోర్టు తీర్పు చూసినంక…కోదండరాము గారి పరిస్థితి గూడ గట్లనే అనిపించి.. నవ్వొచ్చింది.
నా శిన్ననాటి బర్లనుగాసే కోదాడ రామ్ యాదికొచ్చిండు.
మా కోదాడ రామ్ ను అడిగినట్టే..
కోదండ రామ్ గారినీ అడగాలనిపించింది.
ఏమంటే…
సార్..
అత్యంత గౌరవం మర్యాద తో.. అడుగకున్నా…నాడు కేసీఆర్ గారు ఇస్తానంటే తిరస్కరించిన రాజ్యసభ ఎంపీ పెద్దదా?
బహుజన బిడ్డలను బలి చేసి… అంత పొడుగు దీర్ఘం తీసి…రేవంత్ రెడ్డి దగ్గర తీసుకున్న ఎమ్మెల్సీ పెద్దదా?
అని..
– హజారి