మా పార్టీ అభ్యర్థులను ప్రకటించి 60 రోజులైంది.బీ ఫార్మ్స్ కూడా దాదాపు ఇచ్చేసాం.మంచి మెజారిటీ సాధిస్తాం.కేసీఆర్ కు ప్రత్యామ్నాయం ఎవరూ లేరు.కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులే లేరు. బీజేపీ యుద్దానికి ముందే చేతులెత్తేసింది… అసలు రేసులోనే లేదు. ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్లు రావు.కాంగ్రెస్ కు కాంగ్రెస్ చరిత్రే గుదిబండ.
Appsc లో 24400 నియామకాలు.మేము 1.40 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.రాహుల్ ఒక అజ్ఞాని. అతనికి ఏమీ తెలీదు. Sand మాఫియా అని ఆరోపిస్తాడు.కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా అన్నది రాహుల్ కు తెలీదా? కింద నుండి మీదికి సూట్ కేసులు మోసేది కాంగ్రెస్ లోనే.అన్ని మాఫియాలు, స్కామ్ లు కాంగ్రెస్ హయాంలోనే.
55 ఏళ్లలో 7700 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే.అదే మా హయాంలో ఎవరూ ఊహించనంతగా పెంచాం.నల్గొండలో ఫ్లోరోసిస్ పాపం కాంగ్రెస్ దే.విద్య, వైద్యం, సంక్షేమం లో మాకు ఎవరూ పోటీ కాదు.నెక్స్ట్ టైం తెలంగాణకు వచ్చినప్పుడు కనీసం తెలుసుకుని మాట్లాడాలని రాహుల్ కు హితవు.
తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1.మాకు వ్యవసాయంలో సుద్దులు చెప్తే… హాస్యాస్పదంగా ఉంది.మైనారిటీ వెల్ఫేర్ లో టాప్ తెలంగాణనే.ప్రజల్లో కేసీఆర్ పట్ల పూర్తి విశ్వాసం ఉంది.గతంలో ఖమ్మంలో మాకు నాయకులు ఎక్కువ ఉన్నారు.. సీట్లు తక్కువ వచ్చాయి.ఈసారి అక్కడ నాయకులు పోయారు… సీట్లు పెరుగుతాయి.
మంథాని, రామగుండంలో పోటాపోటీ ఉంటుంది.సీ ఓటర్ సర్వే ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైమ్ కూడా వాళ్ళు చెప్పింది. తప్పయింది. ఈసారి అదే రిపీట్ అవుతుంది.వ్యక్తులు కాదు… వ్యవస్థ ముఖ్యం అన్నదే మా స్టాండ్(ఖమ్మం).నల్గొండ లో 12 కు 12 మేమే గెలుస్తాం.ఫ్లోరోసిస్ ఇచ్చింది కాంగ్రెస్… దాన్ని రూపుమాపింది BRS.వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నల్గొండ నెంబర్ 1 జిల్లా.
రైతు బంధు, దళిత బంధు పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా?పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేది మోదీ.. మేమెలా తగ్గిస్తాం? ఈసారి బీజేపీ కి 1 సీటు రావొచ్చు.ఈటల రాజేందర్ 119 స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులే లేరు.బుజ్జగింపుల కమిటీకి జానారెడ్డి చైర్మన్ అయినట్టు… ఈటల పరిస్థితి కూడా ఉంది.
నిజామాబాద్, కరీంనగర్ లో బీజేపీ, కాంగ్రెస్ ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకోలేదా?శివసేన పార్టీ హిందూ పార్టీ అని ఓపెన్ గా ప్రకటించుకుంటోంది… అదే మజ్లిస్ పార్టీ ఎక్కడైనా ముస్లిం పార్టీ అని ప్రకటించుకుందా?మజ్లిస్ మాకు కేవలం ఫ్రెండ్లీ పార్టీ నే.మేము ఎవరికీ బీ టీమ్, సీ టీమ్ కాదు. లుచ్చా టీమ్, a టు z కరప్షన్ పార్టీ కాంగ్రెస్.ఎమ్మెల్యే సీట్లను అమ్ముకుంటోంది రేవంత్, కాంగ్రెస్ కాదా?లేకిగాళ్ళు వచ్చి, మాకు నీతులు చెప్పడమా?
దేశంలో బీజేపీ ని బూచిగా చూపించి, మైనార్టీల ఓట్లు వేయించుకుంటోంది కాంగ్రెస్ కాదా…జనగామ, స్టేషన్ ఘన్పూర్ లో అసంతృప్తి సద్దుమణిగింది.ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి వెళ్లిపోయారు. అది పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే.ఉద్యమకారులు ఆల్రెడీ ఉన్నారు… ఇంకా వస్తున్నారు.రేవంత్ రెడ్డి చెప్పిన బలిదేవత, ముద్దపప్పు తో కోదండరాం కలిస్తే… నేనేం చెప్పాలి చెప్పండి.TSPSC ద్వారా దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేశాం.
బండి సంజయ్, రేవంత్ రెడ్డి, rs ప్రవీణ్ కుమార్, balmuri వెంకట్ కాదా కోర్టులకు వెళ్లి ఆపింది.ప్రవళిక’ మరణాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తే… మేము మానవీయ కోణంలో ఆదుకున్నాం.ఈసారి హుజురాబాద్, గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఓడిపోతారు.కేసీఆర్ ప్రభుత్వ పనితీరును విమర్శించడానికి మోదీ సహా ఎవరూ సరిపోరు.మా నాయకుడు కేసీఆరే ఈ రాష్ట్రానికి సీఎం.
నాకంటే సమర్థులు కూడా మా పార్టీలో ఎందరో ఉన్నారు.ఉదయపూర్ డిక్లరేషన్ ను తుంగలో తొక్కిన కాంగ్రెస్… ఈ గ్యారంటీలను తుంగలో తొక్కదనే గ్యారెంటీ ఉందా..?రాహుల్ గాంధీ లీడర్ కాదు… ఎప్పటికీ రీడరే.కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే కావొచ్చు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలే సపోర్ట్ చేయొచ్చేమో. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి మా మెడపై కత్తిపెట్టి ఇబ్బంది పెడుతోంది.
మేము కూడా ఉద్యమ కారులమే.పోయిన ఉద్యమ కారులను మళ్ళీ మాట్లాడి పిలుపిస్తున్నం.అందుకే వచ్చి చేరుతున్నారు.Tspsc ద్వారా చాలా ఉద్యోగాలు నియామకం అయ్యాయి.ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పట్టించుకోవద్దు. ప్రవళిక చావును కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. మేము ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాం.ఆ అమ్మయిని వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతున్నారు. గజ్వేల్ లో పోటీ చేసిన ఈటెల గెలవరు.
ఇసుక మీద 30 కోట్లు ఆదాయం ఉమ్మడి రాష్ట్రం లో వచ్చింది. కానీ 5000 కోట్ల ఆదాయం వచ్చింది.మైక్ ఇవ్వగానే ఏది పడితే అది రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు.ఏ రంగం తీసుకున్న ఆనాడు అవినీతి లో కూరుకు పోయింది.మెడికల్ కాలేజీలు 3 మాత్రమే పెట్టింది కాంగ్రెస్.మేము.33 మెడికల్ కాలేజీలు ఇచ్చాము.
కాంగ్రెస్ హయాంలో నత్తలు సిగ్గుపడేలా నీటి ప్రాజెక్టులు కట్టారు.రాహుల్ గాంధీ మళ్ళీ వచ్చినప్పుడు నిజాలు తెలుసుకొని రావాలి.తలసరి ఆదాయం లో నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. కర్ణాటక లో కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని అక్కడి మంత్రి స్వయంగా చెప్పారు.
బిజెపి లో ఉన్న అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు. మాకున్న పోటీ కేవలం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ బీ ఆర్ ఎస్ మధ్యే పోటీ ఉంటుంది.ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ ముందుంది లక్ష 30 వేల ఉద్యోగాలు పూర్తి చేశాం.