-జగన్ విధ్వంసాన్ని బాబు సరిచేసే పనిలో ఉన్నారు
– మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశం
• సమస్యలు పరిష్కరించాలని టీడీ జనార్ధన్ కు వినతి
• సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీడీ జనార్ధన్ హామీ
మంగళగిరి: మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్ అధ్యక్షన రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగుల సమావేశాన్ని మంగళగిరి టీడీపీ జాతీయ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏపీ స్టేన్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు, జనరల్ సెక్రటరీ వై. రమేష్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు ఆ సంఘ జిల్లా ఇంఛార్జ్ లు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు 450 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2004 హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఎక్స్ సర్వీస్ మెన్ ఉద్యోగుల సమావేశం మొదటి సారి నిర్వహించినట్లు.. నాడు చంద్రబాబు మాకు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. అప్పటి నుండి టీడీపీ పై మాకు అభిమానం పెరిగిందని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు అన్నారు. నేడు కూటమి గెలపుకు తమ వంతు కృషి చేసినట్లు పేర్కొన్నారు. కావున తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.
కేంద్రియ సైనిక బోర్డులో ఏపీ నుండి ఒక్క రిప్రజెంటేటీవ్ కాని.. జేసీవో కాని లేరని.. వేంటనే ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు టీడీపీలో ప్రత్యేక సెల్ ఉండేదని రాష్ట్ర విభజన తరువాత నేడు ఆ అవకాశం లేదన్నారు. దీంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం తావులేకుండా పోయిందన్నారు.
దివంగత ముఖ్యంత్రి ఎన్టీఆర్ హయాంలో ఎక్స్ సర్వీస్ మెన్ ఉద్యోగుల కోసం 2% రిజర్వేషన్ కోటాను ఏర్పాటు చేస్తే ఆ రిజర్వేషన్ నేడు ఎక్కడా అమలు కావడంలేదన్నారు. ఆ రిజర్వేషన్ ను తిరిగి కొనసాగించాలని వారు కోరారు.
191 జీవో ప్రకారం బ్యాక్ లాగ్ పోస్టులను ఎక్స్ ఆర్మీ ఉద్యోగులకు కేటాయించాలి కాని ఆ జీవో కూడా అమలు కావడంలేదన్నారు. ఇలా ఎన్నో హక్కులు మాజీ సైనిక ఉద్యోగులకు ఉన్నా ఆర్ఎస్పీ, జెడ్ఎస్పీలు వాటిగురించి అవగాహన కల్పించడంలేదన్నారు. మాజీ సైనికుల హక్కులను కాపాడాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీ జనార్థ్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకోసం ప్రాణాలకు తెగించి సంవత్సరాల తరబడి సైనికులు ఇళ్లు వాకిళ్లను వదిలి పనిచేయడం చెప్పలేని త్యాగం. మీ త్యాగానికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా.
అలాంటి రిటైర్డ్ సైనికోద్యోగుల సమస్యలకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న శంకర్ రావును అభినందిస్తున్న.. మీమీ ప్రాంతాల్లో ఉన్న మాజీ సైనిక ఉద్యోగులను గ్యాదర్ చేసి మీ సంఘంలో చేర్చుకోండి. ఇచ్చిన అర్జీల్లో చాలా సమస్యలు నా ముందుకు వచ్చాయి. ఒక ఉద్యోగి తనకు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించుకున్నారని నా ముందు ఆవేదన చెందాడు.
గత ఐదేళ్ల పాలనలో ఉంది రాక్షస ప్రభుత్వం. వాళ్లకు మానవత్వం లేదు. వాళ్లు బ్రతకడమే కాని ఎదుటి వ్యక్తులు బ్రతికితే ఒప్పుకోరు. వాళ్ల ఆస్తులు పెరగాలే కాని ఎవరి ఆస్తులను పెరగనివ్వరు. అదే వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి మీటింగ్ లు పెట్టాలంటే పొద్దున్నే శంకర్ రావును హౌస్ అరెస్ట్ చేసేవారు. బ్రిటీస్ వాళ్ల కంటే దారుణంగా పాలించారు. ఎవరు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితిలేదు.
అలాంటి చీకటి రోజుల నుండి మనం బయటకు వచ్చాం. మాజీ సైనికుల సమస్యలను ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. నియోజకవర్గాల్లో ఉండే స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరి సమస్యలు పరిష్కారం కవాలి అందరి సంతోషంగా ఉండాలన్నదే టీడీపీ, నారా చంద్రబాబు ముఖ్య ఉద్దేశం.
చైనా, భారత్ యుద్ధ సమయంలో అన్న ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి సైనికులకోసం అందించిన గొప్ప వ్యక్తి. ఎన్టీఆర్ గొప్ప మానవతావాధి, ఆయన చెప్పడమే కాదు చేసి చూపించారు. నేడు పేదవాడికి ఆహార భద్రత అని ప్రపంచ దేశాలు ఘోసిస్తున్నాయి. 40 ఏళ్లకిందటనే ఎన్టీఆర్ట్ పేదవాడికి ఆహారభద్రత కల్పిస్తూ కిలో రూ. 2 కే బియ్యాన్ని అందించారు.
పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిన మహనీయుడు. దాన్నే నేడు అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. కోడళ్లపేరుతో ఆస్తులు రాసి ఎన్టీఆర్ అందరికి ఆదర్శంగా నిలిచారు. నదులు అనుసంధానం మొట్టమొదట ఎన్టీరామారావు చేశారు. కృష్ణా, పెన్నాను కలిపి రాయలసీమను సస్య శామలం చేశారు.
తరువాత కృష్ణా, గోదావరిని చంద్రబాబు కలిపి రాయలసీమకు నీళ్లు అందించారు. ఐటీ విప్లవంతోనే అభివృద్ధి సాధ్యమని ముందే తెలుగు జాతికి ఐటీని అందించిన గొప్ప నాయకుడు చంద్రబాబు. అందరి మస్యలను చంద్రబాబు పరిష్కరిస్తారు. మిగిలిన సైనిక సంఘాల్లో ఉన్న ఉద్యోగులతో కూడా స్నేహంతో ఉండి.. సమస్యలు పరిష్కరించుకుంటూ.. మళ్లీ 2029 లో కూడా టీడీపీ గెలుపు కృషి చేయాలి.
ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ కు అవకాశం ఇస్తే వాళ్లు దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎంత మంది ప్రాణాలు తీశారో తెలియుదు. వైసీపీ నేతలు చేసిన విధ్వంసం నేడు చంద్రబాబు సరిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి నిరంతరం 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని 800 మంది సభ్యులగా ఉన్న సంఘం అభివృద్ధి చెంది లక్షమందితో పెద్ద బహిరంగ సభ పెట్టుకునేలా పనిచేయాలని కోరుకుంటున్నా.