* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* రైతుల పక్షపాతి సీఎం చంద్రబాబు
* ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలిస్తున్న చంద్రన్న
* ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం : మంత్రి సవిత
* సోమందేపల్లి నుంచి పెనుకొండ వరకు 550కు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
* 9 కిలో మీటర్లకు పైగా సాగిన ట్రాక్టర్ల ర్యాలీ
* ర్యాలీ ఆద్యంతం స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి సవిత
* భారీగా తరలొచ్చిన రైతులు
పెనుకొండ/ శ్రీ సత్యసాయి : అన్నదాతల బాగు కోరుకునే ప్రభుత్వం తమదని, రైతుల పక్షపాతి సీఎం చంద్రబాబు అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మొదట విడత నిధులు జమ సందర్భంగా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రి సవిత ఆధ్వర్యంలో రైతులు 550కు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి నుంచి పెనుకొండ మార్కెట్ యార్డ్ వరకూ తొమ్మిది కిలో మీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పెనుకొండ మార్కెట్ యార్డ్ వద్ద తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చుతున్నారన్నారు.
మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఉచిత ఇసుకతో పాటు మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం పేరుతో నిధులు అందజేశామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇవ్వని విధంగా సామాజిక పెన్షన్లు అందజేస్తున్నామన్నారు.
వితంతు, వృద్ధాప్యపు పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామన్నారు. దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేశామన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించుకుండా అడ్డుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. దేశ విదేశాలకు తిరిగి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారన్నారు.
రాష్ట్రంలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను మంత్రి లోకేశ్ గాడినపెడుతున్నారన్నారు. విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
అన్నం పెట్టే రైతన్నకు ఆర్థిక భరోసా
రైతు పచ్చగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేది సీఎం చంద్రబాబు ప్రగాఢ విశ్వాసమన్నారు. సమాజానికి అన్నం పెట్టే రైతన్న పెట్టుబడి కోసం ఎవ్వరికీ చేయి చాపకూడదనే అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. దీనిలో భాగంగా ఏడాదికి రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయాన్నిఅందజేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. తొలి విడతగా రూ.7 వేలను రైతుల ఖాతాల జమ చేశామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు అని తెలిపారు. 46,85,838 మంది రైతులకు వారి ఖాతాల్లో మొదటి విడతగా 2,342. 92 కోట్లు జమచేశామన్నారు. రెండో విడతగా రూ.7 వేలు, మూడో విడతగా రూ.4 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ తో పాటు విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలతో పాటు వ్యవసాయంలో సాంకేతికతను జోడిస్తున్నామని, డ్రోన్స్, శాటిలైట్, సెన్సార్, డీప్‌టెక్ వినియోగిస్తున్నామని తెలిపారు.
రైతులకు సబ్సిడీపై డ్రోన్లు అందజేస్తున్నామన్నారు. వంద శాతం సబ్సిడీపై స్ప్రింకర్లు అందజేస్తున్నామన్నారు. పొలం పిలించింది కార్యక్రమంతో రాష్ట్రంలో సాగు పెంచేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని మంత్రి సవిత తెలిపారు.
అపర భగీరథుడు చంద్రబాబు
సీఎం చంద్రబాబు అపర భగీరథుడని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మంత్రి సవిత వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి సవిత
అంతకుముందు సోమందేపల్లి వై జంక్షన్ నుంచి పెనుకొండ మార్కెట్ యార్డ్ వరకూ తొమ్మిది కిలో మీటర్ల మేర భారీ మంత్రి సవిత ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. నియోజక వర్గానికి చెందిన భారీ సంఖ్యలో రైతులు, రైతు కూలీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 550కు పైగా ట్రాక్టర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించిన మంత్రి సవిత చివరి వరకూ వాహనం నడుపుతూ, రైతులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
అన్నదాత సుఖీభవ నిధులు మంజూరు చేసి పెట్టుబడి సాయం చేసిన సీఎం చంద్రబాబుకు రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో రైతులు తరలి రావడంతో సోమందేపల్లి-పెనుకొండ రహదారి కిక్కిరిసి పోయింది. రైతుల నినాదాలతో పెనుకొండ దద్దరిల్లిపోయింది.