Suryaa.co.in

Telangana

రైతుకే పన్నులు కడుతున్న ప్రభుత్వం మాది

– దమ్ముంటే సంక్షేమంలో మాతో పోటీపడండి
– రైతు హంతకుడు శివరాజ్ చౌహాన్
– రైతుబంధు సంబురాల్లో మంత్రి హరీష్, స్పీకర్ పోచారం, మహమూద్ అలీ, తలసాని
– భారీ స్థాయిలో కేసీఆర్ చిత్రమాలిక

దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప పథకం రైతుబంధు కార్యక్రమం అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం NTR స్టేడియంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుబంధు సంబురాలలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగులతో రూపొందించిన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రమాలిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటలు, పెద్ద ఎత్తున ముగ్గులు, గొబ్బెమ్మల ఏర్పాటు, చెరుకు గడల ప్రదర్శన సంక్రాంతి పండుగను సందడిని తలపించింది. రైతుబంధు సంబురాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వైద్య & ఆర్ధిక శాఖ మంత్రి టి హరీష్ రావు , రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , రాష్ట్ర
kcr1 ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, TSMIDC చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, శాసనమండలి సభ్యులు MS ప్రభాకర్, శాసనసభ్యులు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, మాగంటి గోపినాద్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా ఎనిమిది విడతలలో యాబైవేల కోట్ల రూపాయలను అందుకున్న శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికి అన్నం పెట్టె

రైతన్నకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయం రైతుబంధు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆరి మదిలో నుండి వచ్చిన పథకమే రైతు బంధు అన్నారు. పార్టీలకు, కుల మతాలకు అతీతంగా 63 లక్షల మంది రైతులకు రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. సీజన్ రాగనే రైతుబంధు డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో పడుతున్నాయిని చెప్పారు.

కొంతమంది ఉచిత ఎరువులు అంటూ మాట్లాడటం హాస్యాస్పదం. రైతుబందు ద్వారా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలను అందిస్తున్నది రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోలు చేయడానికే అన్నారు. పెట్టుబడుల కోసం ఎవరికి దండం పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం అందిస్తున్న ఎకరాకు పదివేల రూపాయలతో అప్పులు తేకుండా విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చేసుకుంటున్నారు. పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ప్రమాద బీమా మాత్రమే చేస్తాయి. కాని రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో రైతుల సాధారణ మరణానికి కూడా జీవిత బీమా చేయించారు. ఇన్ని లక్షల మందికి సాధారణ బీమా చేయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.

1600 కోట్ల రూపాయలను నలబై లక్షల మంది రైతుల పేరు మీద జీవిత భీమా చేస్తున్నారు. సాధారణ మరణానికి కూడా రైతు బీమా వర్తించే విదంగా ప్రతి రైతుకు నాలుగు వేల రూపాయల ప్రీమియంను రాష్ట్ర

ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇప్పటి వరకు డెబ్బై వేల మంది రైతులకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల వంతున 3500 కోట్ల రూపాయలను రైతు బీమా ద్వారా వారి కుటుంబ సభ్యులకు చెల్లించినట్లు వివరించారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన వ్యవసాయ అభివృద్ధి పథకాలలో రైతుబంధు, రైతు బీమా కు స్థానం లభించిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి కోసం రెండు పంటలకు సాగునీరు, ఉచితంగా 24 గంటల కరెంటు, పండించిన పంటల కొనుగోలు జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు బాగా తగ్గాయని పేర్కొన్నారు. నేను స్పీకర్ హోదాలో రాజకీయాలు మాట్లాడడం సరికాదు. అయినప్పటికి కొంతమంది ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణాకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. వారు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు మీ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారా ??? .. మీ దగ్గర కూడా రైతులు, కూలీలు, పేదల ఉన్నారు, వారికి తెలంగాణ రాష్ట్రంలో కంటే ఎక్కువ సహాయం చేసి మాటలు అనండి. మీ రాష్ట్రాలలో కూడా రైతుబంధు, రైతుబీమా అమలు చేయండి, ఇంత కంటే ఎక్కువ నగదును అందించి అప్పుడు మాట్లాడండి.

మీ రాష్ట్రాల్లో కూడా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వండి, పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి కళ్యాణలక్ష్మీ ఇవ్వండి, రెండు పంటలకు సాగునీరు ఇవ్వండి. పనిలో పోటి పడండి అంతేకాని మాటలలో కాదు. ఉన్నత పధవులలో ఉన్నవారు హుందాగా మాట్లాడాలి. లేకపోతే పరువు పోతుందని హితవు పలికారు. వైద్య ఆరోగ్య
kcr2శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రైతుకు ఓనాడు అప్పు పుట్టేది కాదు. పెట్టుబడి కోసం తిరిగే పరిస్థితి అన్నారు. కుల, మతాలకు అతీతంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఇప్పటి వరకు 50 వేల కోట్లు సాయం చేశారని తెలిపారు. దేశంలో ఇలా సాయం చేసిన తొలి సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.

ఇప్పటి వరకు ప్రభుత్వాలు రైతులపై పన్నులు వేశాయి. కాని రైతుకే పన్ను కట్టింది మాత్రం సీఎం కేసీఆర్ అన్నారు. భూమి శిస్తు, నీటి తీరువా, కరెంటు బిల్లు , బ్యాంకు రుణాలకు వడ్డీలు వసూలు చేసే ప్రభుత్వాలు ఉండేవి. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డిజీల్ ధరలు పెంచి వ్యవసాయం భారం చేసిందని దుయ్యబట్టారు. వ్యవసాయ ఖర్చుల పెంచి రైతులపై భారం వేసింది బీజేపీ. రైతులకు ఖర్చులకు డబ్బులు ఇచ్చి భారం తగ్గించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

రైతులు ఆదుకోమని వస్తే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ మీ రాష్ట్రంలో పిట్టల్లా కాల్చిన చంపి రైతు హంతకుడిగా పేరు పొందావు.నీ రాష్ట్రంలో ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధు ఉందా. మీరా మాట్లేడేది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద దేశంలో అతి ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఏడేళ్లలో రెండు లక్షల 50 వేల కోట్లు ఖర్చు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

మీరు మీ రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ల ద్వారా నీళ్లు ఇచ్చారా, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారా అని ప్రశ్నించారు. పండిన పంట కొనమంటే చేతులు ఎత్తేసిన దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అని మండిపడ్డారు. నెహ్రూ, ఇందిర, వాజ్ పాయ్ వంటి చాలామంది ప్రధానమంత్రులు రైతుల నుంచి పంటలు కొన్నారు. కాని బీజేపీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని విమర్శించారు. రాష్ట్ర పరిధిలో మేం చేయాల్సిందంతా చేశాం. కాని మీ పరిధిలో ఉన్న పంట కొనుగోలుపై మీరు మాత్రం చేతులెత్తేశారని విమర్శించారు.

రోజుకో ముఖ్యమంత్రి బీజేపీ వాళ్లు ఇక్కడకు వ చ్చి మాట్లాడుతున్నారు. దమ్ముంటే మా రాష్ట్రంతో అభివృద్ధితో పోటీ పడండి, రైతు సంక్షేమంలో పోటి పడండి అని సవాల్ చేశారు. చేతనైతే రైతులకు రైతు బందు సాయం చేయండి, ఉచిత విద్యుత్ ఇవ్వండి అని హితవు పలికారు. ఏడు మండలాలు లాక్కున్నారు, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. 317 జీవో రద్దు చేయమంటున్నారు. దేని కోసం చేయాలి అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగంలో 15 లక్షల 69 వేల ఖాళీలు ఉన్నా వాటిని నింపకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని అన్నారు.

రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్ లో 2 లక్షలు, కేంద్రంలో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా వాటిని మాత్రం భర్తీ చేయరని విమర్శించారు. 317 జీవోను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని నింపాలని సీఎంగారు ఆలోచిస్తుంటే, BJP అడ్డుపడుతుందని అన్నారు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయే సమయంలో కేసీఆర్ గారు అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్లి ఆంధ్ర, తెలంగాణ విడిపోతుంది.

తెలంగాణ వాళ్లకు, తెలంగాణలో స్థానికంగా ఇవ్వాలని కోరితే అలా ఇవ్వడం సాధ్యం కాదన్నారని చెప్పారు. రాష్ట్రాలు విభజన గతంలో చేసినట్లు చేస్తాం. తప్ప స్థానికులకు స్థానికంగా ఉద్యోగాలు ఇవ్వం అన్నరు. అయినా సీఎం కేసీఆర్ గారు అమలు చేస్తున్నదేంటి. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చారని పేర్కొన్నారు. భారత రాష్ట్ర పతి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చారో… అదే జీవోను మేం అమలు చేస్తున్నాం. రాజకీయ లబ్ధికోసం బీజేపీ రాష్ట్ర పతి ఉత్తర్వులు అమలు చేయవద్దంటు అడ్డుకుంటున్నారని తెలిపారు.

మీకు ప్రజలపైన, నిరుద్యోగులపై ప్రేమ లేదన్నారు. ఏడేళ్లలో లక్షా 39 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు. ఉద్యోగులకు తెలంగాణా ప్రభుత్వం ఇస్తున్న వేతనాలను ఏ బీజేపీ రాష్ట్రం కూడా ఇవ్వడంలేదని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో పీఆర్సీ 30 శాతం ఇచ్చిన
kcr-paintప్రభుత్వం మాది. కేంద్ర ప్రభుత్వం ఏడున్నర శాతం ఇచ్చారు. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకన్నా తక్కువ ఇచ్చిందని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే ఉద్యోగ సంఘాలతో, ఉపాధ్యా సంఘాలతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. బీజేపీది స్థానికులకు ఉద్యోగాలు దొరకవద్దు అన్న కుటిల నీతి అని విమర్శించారు.

బీజేపీ మాటలు కేవలం గోబెల్స్ ప్రచారం అన్నారు. మీకు రైతులపై ప్రేమ ఉంటే పది వేల రైతు బంధు దేశం అంతా ఎందుకు ఇవ్వరు అని ఆయన ప్రశ్నించారు. మేం ఉద్యోగులకు ఇచ్చినట్లు 30 శాతం ఫిట్మెంట్ మీరు దేశ మంతా ఇవ్వండి అన్నారు. జై జవాన్, జైకిసాన్ అన్న నినాదాన్ని బీజేపి ప్రభుత్వం జై జవాన్, నై కిసాన్ గా మార్చిందని అన్నారు. బీజేపికి రైతులంటే చిన్నచూపు అని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయమంటోందని అన్నారు.

LEAVE A RESPONSE