కుప్పం ఏమన్నా పాకిస్థాన్ లో ఉందా?
జగన్ కంటే బ్రిటిష్ వాళ్ళు బెటర్
మేమూ ఈ పోలీసుల పై రివర్స్ కేసులు పెడతాం
కుప్పం లాఠీచార్జీలో గాయపడి చికిత్సపొందుతున్న కార్యకర్తలను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
పోలీసులు తీవ్రంగా కొట్టారని చంద్రబాబుతో బాధితుల ఆవేదన
మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు
కుప్పం ఏమన్నా పాకిస్థాన్ లో ఉందా? ఇదేమన్నా పాకిస్థానా?
రాష్ట్రంలో ఉన్న పోలీసులంతా కుప్పం వచ్చారు. సుమారు 1500 మంది పోలీసులు మా కార్యకర్తలపై దాడి చేయడమే కాకుడా మాపైనే అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టారు.
ప్రశాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో అలజడులు సృష్టిస్తున్నారు.
నేతలు, కార్యకర్తలపై మొత్తం నాలుగు కేసులు పెట్టారు.
మేమూ ఈ పోలీసుల పై రివర్స్ కేసులు పెడతాం.
సైకోలు చెప్పారని ఈ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారా?
ఈ సైకో సీఎం ఇవాళ ఉంటాడు.. రేపు పోతాడు.
అధికారులతో జగన్ రెడ్డి నేరాలు చేయిస్తున్నాడు. మీరు కచ్చితంగా జైలుకు పోవడం ఖాయం.
కందుకూరు ఘటనలో పోలీసుల వైఫల్యం లేదా?
పోలీసులను పెట్టక పోవడం కుట్ర కాదా?
మీరే కుట్ర చేసి మీరే తిరిగి కేసులు పెడతారా?
కందుకూరు లో పోలీసులను ఎందుకు పెట్టలేదు?
నాకు పోలీసులపై ఎంతో గౌరవం ఉండేది. ఇలా చేసి చెడ్డపేరు తెచ్చుకుంటున్నారు.
దీని వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది.
తప్పు చెయ్యకపోతే కేసు పెట్టం అని పోలీసులు తేల్చి చెప్పాలి.
ఈ రోజు మాత్రమే కాదు రేపు ఎల్లుండి కూడా ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి.
కుప్పం లో గ్రానైట్ వ్యాపారులకు పెద్దిరెడ్డి నోటీసులు ఇచ్చి బెదిరించింది నిజం కాదా?
కుప్పం, పుంగనూరు కాదు..అన్ని చోట్లా ఇలానే చేస్తున్నారు.
పెద్దిరెడ్డి వందల కోట్లు దోచుకుంటూ పోతుంటే మేము సైలెంట్ గా ఉండాలా?
పెద్దిరెడ్డికి చెందిన పుంగనూరులోని శివశక్తి డైరీ లీటరు పాలకు ఎంత ఇస్తుంది? మేము ప్రశ్నించిన తరువాతనే పాల ధర పెంచారు.
నాడు జగన్ పర్యటనలో కూడా 8 మంది చనిపోయారు. నేను కేసులు పెట్టలేదు.
నీచ బుద్ధి, తప్పుడు ఆలోచనలతో జగన్ మరింత దిగజారి వ్యవహరిస్తున్నాడు.
జగన్ కంటే బ్రిటిష్ వాళ్ళు బెటర్.
గుంటూరు ఘటనలో కోర్టు చెప్పింది విన్నాకైనా ప్రభుత్వానికి సిగ్గుండాలి.
ఒక సైకో చెప్పాడు అని మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారు..ఎంత దారుణం?
సాక్షి గుమస్తా సజ్జలకు ఐపీఎస్, ఐఏఎస్ లు బానిసలు అయ్యారు.
మాది పార్టీ పోరాటం కాదు.. ప్రజాపోరాటం