Suryaa.co.in

Andhra Pradesh

పి.ఆర్.సి. పెండింగ్ అంశాల పై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చ

అమరావతి: పి.ఆర్.సి. పెండింగ్ అంశాలు, డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సభ్యులైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఝంగా చర్చించారు. బుధవారం అమరావతి సచివాలయం 2 బ్లాక్ లో జరిగిన ఈ సమావేశంలో పి.ఆర్.సి. పెండింగ్ అంశాలు, డిమాండ్లకు సంబందించి ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలపై జరిగిన చర్చలో సాధ్యమైనంత మేర ఆర్థికేతర అంశాలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో భాగంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమల్లో సమస్యల పరిష్కారం, 62 సంవత్సరాలకు పెంచిన పదవీ విరమణ వయస్సు సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాలతో పాటు పలు సంస్థల ఉద్యోగులకు వర్తింపు, నూతన జిల్లాలకు పాత జిల్లాల హెచ్.ఆర్.ఏ. వర్తింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు సత్వరమే కారుణ్య నియామకం, క్యాడర్ వారీగా పే స్కేళ్ల ఫిక్సేషన్ జి.ఓ. జారీ తదితర అంశాలపై సుదీర్ఝంగా చర్చలు జరిగాయి.

అదే విధంగా ఆర్థిక అంశాలకు సంబందించి పెండింగ్ బిల్లుల క్లిరెన్సు, పి.ఆర్.సి., డి.ఏ. బకాయిల చెల్లింపు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఝంగా చర్చలు జరిగాయి. వీటన్నింటినీ సాద్యమైనంత త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తెలిపారు.

జిఏడి సర్వీసెస్ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)పి.చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో పాటు ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ, ఏపి ఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు వై.వి. రావు తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE