-బ్లూబుక్ తయారు చేస్తున్నాం
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు. దీనిపై కోర్టు లో పిటిషన్ వేసాను. కోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్థానిక శాసన సభ్యుడు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చింది. జీఓ ను కచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పింది.
రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఏ విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు? ఏ హోదాలో ఆయన పంచుతున్నారు? సిగ్గుందా మీకు? మీరు గెలిచినట్టే మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళమే. ఇవాళ మమల్ని ఇబ్బంది పెడుతున్నారు. అధికారుల ఓవరాక్షన్‌పై బ్లూబుక్ తయారుచేస్తున్నాం. రేపు మేము అధికారం లోకి వచ్చాక చూపిస్తాం. నన్ను ఇబ్బంది పెట్టండి కానీ, హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు.