Suryaa.co.in

National

ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ హసన్ సాహెబ్ కు పద్మశ్రీ

తిరువూరుకు చెందిన ప్రముఖ నాదస్వర విద్వాంసులు షేక్ హసన్ సాహెబ్ కు కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 1930లో గంపలగూడెం మండలం గోసవీడులో జన్మించారు. చిలకలూరిపేట చిన మౌలా సాహెబ్ వద్ద సంగీత శిక్షణ పొందిన ఆయన భద్రాచలం, యాదగిరి గుట్ట దేవస్థానాల్లో నిలయ విద్వాంసులుగా పనిచేశారు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం లో కూడా పలు కార్యక్రమాలు అందించారు. పలువురు విద్యార్థులకు సంగీతం లో శిక్షణ ఇవ్వడం తో పాటు గత 67 సంవత్సరాల పాటు తిరువూరు త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలలో సంగీత కచేరీలు చేశారు. ఆయనను 1962లో స్వర్ణ కంకణంతో, 2007 లో త్యాగరాజ పరస్కార్ అవార్డుతో గానకళాసమితి సత్కరించింది. 2021లో జూన్ 24 న హసన్ సాహెబ్ మృతి చెందారు. మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ఆయన అభిమానులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE