విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యాపార అభివృద్ది సంస్ధ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఎపి -సీడాప్) ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా పాలడుగు నారాయణ స్వామి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టేషన్ ప్రాంగణంలోని నందమూరి తారక రామారావు పరిపాలనాభవనంలోని సిడాప్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
2022 నవంబరు నుండి రాజ్ భవన్ లో గవర్నర్ ఉప కార్యదర్శిగా నారాయణ స్వామి వ్యవహరిస్తున్నారు. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని నైపుణ్యాభివృద్ది, శిక్షణా విభాగంలో అంతర్బాగంగా ఉన్న సిడాప్, గ్రామీణ యువతకు అవసరమైన ఉద్యోగ శిక్షణను అందించి వారి ఉపాధికి మార్గం చూపుతోంది.
ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను నిర్వర్తించి గణనీయంగా యువత ఉపాధిని పొందగలిగేలా ప్రయత్నిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నైపుణ్యాభివృద్దికి గణనీయంగా నిధులు తీసుకువచ్చే క్రమంలో తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.