-
పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు
-
సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
జి.కొండూరు మండలం పినపాక గ్రామంలో ‘పల్లెపండుగ’ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. పినపాకలో 18.3 లక్షల వ్యయంతో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మహాకూటమి ప్రభుత్వంతో సాధ్యపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులతో గ్రామాలు నూతన శోభను సంతరించుకుంటాయన్నారు.
గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేసినప్పుడు సకాలంలో బిల్లులు మంజూరు కాక నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం అభివృద్ధి పనులు చేసిన తర్వాత నిర్ణీత వ్యవధిలోని నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లిస్తారని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తున్న సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.