నరసరావుపేట: పల్నాడు జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల వైఎస్ఆర్ సిపి సమీక్ష సమావేశాలను దక్షిణ కోస్తా జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి వేరువేరుగా నిర్వహించారు.
ఉదయం నుండి నరసరవుపేటలో గురువారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట), ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు (వినుకొండ), ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి (గురజాల)ఎమ్మెల్యే నంబురి శంకర్రావు (పెదకూరపాడు), రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు (సత్తెనపల్లి), రాష్ట్ర మంత్రి విడుదల రజిని (చిలకలూరిపేట)అసెంబ్లీ నియోజకవర్గాల వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు.
ఈ సమావేశాలకు జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే పినెల్లి రామకృష్ణ రెడ్డి,లోక్ సభ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు,మండలి చిప్ విఫ్ ఉమా రెడ్డి వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా ద్వితీయ,తృతీయ నాయకుల,కార్యకర్తల అభిప్రాయలను విజయసాయిరెడ్డి అడిగి తెలుసుకున్నారు..