Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ సర్కారువి నవ రత్నాలు కాదు.. నవ అరాచకాలు!

* పవన్ కళ్యాణ్ ని విమర్శించడమే మంత్రులకు పని
* తమ శాఖ విధులు ఏంటో తెలియని మంత్రులు ఉండడం దౌర్భాగ్యం
* ఆంధ్రా థానోస్ జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
* మంత్రి దాడిశెట్టి రాజా దొంగ బంగారం వ్యాపారం, గంజాయి స్మగ్లింగ్ గురించి అందరికీ తెలుసు
* విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ

కల్తీ మద్యం, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, పోలీస్ కేసులు, పన్నుల బాదుడు, అప్పుల కుప్పలు, నిరుద్యోగ భారం, గుంతల రోడ్లు, బూతుల తిట్లు అనే అద్భుతమైన నవరత్నాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు బహుమతి గా ఇస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ వ్యాఖ్యానించారు. వైసీపీ అమలు చేస్తున్న నవ అరాచకాలు, దౌర్జన్యాలనే నవరత్నాలు అని అనుకుంటూ భ్రమ పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి అంటే ఏమిటో ఎప్పుడో మర్చిపోయారని ఆయన చెప్పారు. కాకినాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ “రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క మంత్రికి కూడా తాను నిర్వహిస్తున్న శాఖ ఏమిటో తెలీదు. ఆ శాఖ విధులు, బాధ్యతలు ఏమిటి అన్నది కూడా అవగాహన లేదు. శాఖల మీద పట్టు పూర్తిగా శూన్యం ఉన్న మంత్రులు ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం. తమ పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారి మీద పడి ఏడవడం వీరికి అలవాటు. పవన్ కళ్యాణ్ కి జనంలో పెరుగుతున్న ఆదరణ చూసి మంత్రులకు పిచ్చెక్కుతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రకరకాల పిచ్చిపిచ్చి ఆరోపణలు చేసి, చంకలు గుద్దుకుంటున్నారు.

తునిలో దాడిశెట్టి రాజా నవరత్నాలు వేరు
పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే – చెత్త మీద పన్నులేసే చెత్త బ్యాచ్ ఒకటి తయారై చెత్త వాగుడు వాగుతోంది. ఆ చెత్త బ్యాచ్ లో మంత్రి దాడిశెట్టి రాజా ఒకరు. తునిలో మీరు చేస్తున్న దొంగ బంగారం వ్యాపారం గంజాయి వ్యాపారం మాటేమిటి.
నవరత్నాలు అంటే దొంగ బంగారం, గంజాయి, మద్యం, శాండ్ మాఫియా, కబ్జాలు, నకిలీ విత్తనాలుగా అర్ధం మార్చేసిన చెత్త బ్యాచ్ రాజాది.
మీరెన్ని మాటలు చెప్పినా మేము ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు వెళుతూనే ఉంటాం. వారి తరుపున పోరాడుతూనే ఉంటాం. మొన్నటి వరకు వైసీపీలో మొరిగిన బ్యాచ్ వెళ్లి… ఇప్పుడు కొత్త బ్యాచ్ దిగింది. ఆయా పరిస్థితులను బట్టి కొత్త బ్యాచ్లు దింపడం వైసీపీ కి అలవాటే. ఇలాంటి వారి మొరుగుళ్లకు మేం భయపడేది లేదు. వీరిని గడపగడపకు వెళ్తుంటే ప్రజలే తరిమి తరిమి కొడుతున్నారు.
కాకినాడ రూరల్ లో ఉన్న ఇండస్ట్రీలు అన్ని రాబోయే పది రోజుల్లో తమ పరిశ్రమల్లో భద్రతా పరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే జనసేన పోరాటానికి సిద్దమవుతుంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు సూట్ కేస్ లు జాగ్రత్తగా దాచుకో వాలి. లేదంటే మళ్ళీ ఏదో ఒక టీమ్ వచ్చి సూట్ కేసులు పట్టుకుపోతారు.

వైసీపీ కి కార్యాలయం ఎందుకు? చంచల్ గూడ జైలు ఉందిగా..!
ఈ ముఖ్యమంత్రి ఎంత కాలం బయట ఉంటారో అర్థం కాని పరిస్థితి వైసీపీ నాయకులది. రోజుకో కొత్త స్కామ్ లో రాష్ట్ర నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. నరరూప రాక్షసుడు థానోస్ రాష్ట్రంలో బయటే తిరుగుతున్నాడు అని ప్రజల భయపడుతున్నారు. మా పార్టీ అధికారికంగా బీజేపీ తో కలిసి పయనిస్తోంది. కానీ వైసీపీ మాత్రం రహస్యంగా దానిని కొనసాగిస్తోంది. ఆంధ్ర థానోస్ ఇంకా ఎక్కువ కాలం బయట ఉండడు అతడికి జైలే గతి. కాబట్టి వైసీపీ కార్యాలయాలను ఆయా జైళ్లకు మార్చుకోవడం ఉత్తమం.
విశాఖపట్నంలో ఓడిపోయిన ముఖ్యమంత్రి తల్లిని కూడా వైసీపీ మంత్రులు అవహేళన చేస్తున్నారు. ఓడిపోయారు అంటూ ప్రతిసారి ఆమెను నొప్పిస్తున్నారు. 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పాపానికి పాలన పూర్తిగా మర్చిపోయిన వైసీపీ నాయకులు, ప్రజలకు మంచి చేసే వారిపై దిగజారి మాట్లాడి మరింత ప్రజల్లో చిన్నబోతున్నారు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వీరికి పడుతున్న చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈసారి జనం వద్దకు ఓటు వేయమని వెళితే కచ్చితంగా వీరికి మూడినట్లే. రాష్ట్ర ప్రజలంతా వైసీపీని తరిమికొట్టడానికి, వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ను చూడడానికి సిద్ధంగా ఉన్నారు” అన్నారు.

LEAVE A RESPONSE