పరాభవ నామ వత్సరం అంటే భయపడాల్సిన పని లేదు అంటోంది మన పంచాంగం. పంచాంగం లోని 60 సంత్సరాలలో పరాభవ నామ వత్సరం నలభయ్యో ది. అంటే సమృద్దిగా సుఖాన్ని మోసుకొని వచ్చేదని అర్థం. సదరు సుఖం ఏ రూపంలోనైనా ఉండవచ్చు.
ముఖ్యంగా దేశం స్వయం సమృద్ది దిశగా పరుగులు పెడుతుంది.దేశం అందులో ప్రజల సంక్షేమ సుఖాలే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వాలు నడుచుకుంటాయి. మనకున్న 60 సంవత్సరాల్లో దుర్ముఖి,హేవళంబి, విళంబి , వైఖరి, శార్వరి అనేవి.
అంటే 30,31,32,33,34 సంవత్సరాలు వరుస క్రమంలో సూచిస్తాయి.ఈ అయిదు సంవత్సరాలను పంచ గుళ్ళు అంటారు. అదే విధంగా 52 సంవత్సరమైన కాళయుక్త నుంచి 58 వ వత్సరమైన రక్తాక్షి వరకు అంటే 53,54,55,56,57,58 వత్సరాలైన సిధార్థ, రౌద్రి, దుర్మతి, దుందుభి రుధిరోద్గారి, రక్తాక్షి అనే ఏడు వరుస సంవత్సరాలను సప్త గుళ్ళు అని పిలుస్తారు.
అంటే మొత్తం 60 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు మాత్రమే మనకు నష్టాన్ని,మనస్తాపాలు కలిగిస్తాయి. ఈ పంచ-సప్త గుళ్ళు జాబితాలో పరాభవ లేదు కనుక ఇది మనకు శుభాలనే అందిస్తుంది తప్ప అంటారు చెబుతున్నట్టుగా ఎటువంటి కష్టాన్ని కలిగించదు.
గుళ్ళ జాబితాలో చెప్పిన 12 సంవత్సరాల్లో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా సంభవించి ఆస్తి,ప్రాణ నష్టాలు జరుగుతాయి.మనకున్న 60 సంవత్సరాల కాల వ్యవధి కి ఒక ప్రాముఖ్యత ఉంది అదేమంటే ఈ 60 వత్సరాల కాలంలో జీవ కారకుడైన గురు గ్రహం జ్యోతిర్ చక్రంలోని 12 రాశుల ను 5 సార్లు చుట్టి వస్తుంది[5×12=60]
ఆయుష్ కారకుడైన శనీశ్వరుడు ఇదే చక్రంలోని 12 రాశులను రెండు సార్లు చుట్టి వస్తాడు [2 x30=60]. మన గత కర్మలకు ప్రస్తుతం లో సకాలంలో ఫలితాలు ఇచ్చే రాహు-కేతు గ్రహాలు ఈ 60 సంవత్సరాల వ్యవధిలో రమారమి 8.3 సార్లు 12 రాశుల సంచారాన్ని పూర్తి చేస్తారు [8.3x 7.2=59.76].
గమనించితే జీవులకు 60 నిండగానే శక్తి తగ్గడం మొదలవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి విజ్ఞులు 60 సంవత్సరాల సేవ కాలం ముగియగానే పదవీ విరమణ అనే రిటైర్మెంట్ కాల వ్యవధిని నిర్ధారించారు.
కొత్త సంవత్సరాదిన పంచాంగ కర్తలు ఇచ్చే రాజ-పూజ్య, ఆదాయ-వ్యయాలు అనేవి సంవత్సరంలో పుట్టిన వారికి మాత్రమే వర్తిస్తాయి తప్పించి, ఆయా రాశులకు చెందిన వారందరికీ కాదు అని గమనించండి.
పుట్టిన సంవత్సరంలో ఇచ్చిన రాజ-పూజ్య, ఆదాయ-వ్యయాలు స్థిరమైన గణాంకాలు అని గ్రహించండి . అవి ఏటా ప్రతి ఉగాది కి అందరికి మార్పు చెందవు. ఇది తెలియక ఏటా ఇచ్చే వీటి సంఖ్యలను చూసి సంతోషమూ-విచారమూ రెండూ వద్దు.
డా.బాత్రిసు (బాలా త్రిపుర సుందరి)