Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీతో పెట్టుకున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అవినీతి, అక్రమాల గుట్టు విప్పి ప్రజల్లో ఆయన్ని దోషిగా నిలబెడతాం

• తెలుగుదేశంతో పెట్టుకున్న కేతిరెడ్డి భూ స్థాపితం అయ్యేవరకు వదిలిపెట్టం.
• ధర్మవరం చుట్టుపక్కల కేతిరెడ్డికి ఉన్నభూములు, గుర్రాలకోటపై భారీ ప్యాలెస్ ఎక్కడినుంచి వచ్చాయి.
• కేతిరెడ్డి చేయిస్తానంటున్న సర్వే ప్రజలు చూసేలా లైవ్ పెట్టించి చేయిస్తే, ఎక్కడెంత భూమి, ఎవరిపేరుతో ఉందో తేలుతుంది?
– ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్

“ధర్మవరంలోని గుర్రాలకోటపై బ్రహ్మండమైన ప్యాలెస్ కేతిరెడ్డి నిర్మించుకున్నాడు. స్థానిక వైసీపీఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలు, అవినీతిపై టీడీపీయువనేత లోకేశ్ మాట్లాడితే, సదరు శాసనసభ్యుడు ఉలిక్కిపడ్డాడు. కేతిరెడ్డి మామూలుగా చాలా కూల్ గా ఉంటారు… ఆయన అవినీతిని బయటపెట్టేసరికి టెన్షన్ పడుతున్నారు. ఈరోజు కాకుంటే, రేపు, లేకపోతే మున్ముందు కేతిరెడ్డి అవినీతిని తాము ఆధారాలతో సహా బయపెట్టే తీరుతాం .

జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు అవినీతి సొమ్ముతో ప్యాలెస్ లు నిర్మించుకోలేదని కేతిరెడ్డి తెలుసుకోవాలి
చంద్రబాబు నివాసముండే ఉండవల్లి ఇల్లు అద్దె ఇల్లు. మాజీముఖ్యమంత్రి, టీడీపీ అధినేత అంత పెద్ద ఇంటిలో ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీపరమైన సమావేశాలు, నేతలతో భేటీలు జరపడానికి ఆయనకు ఆమాత్రం ఇల్లు ఉండకూడదా అని కేతిరెడ్డిని ప్రశ్నిస్తున్నాం. కరకట్టపై నిర్మించిన నిర్మాణాలన్నింటికీ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డే అనుమతి ఇచ్చారనే వాస్తవాన్ని కేతిరెడ్డి గ్రహించాలి. చంద్రబాబు నెలానెలా అద్దెకడుతూ ఉండే ఇంటిని, కేతిరెడ్డి తనకబ్జాల ఇంటితో పోలిస్తే ఎలా? టీడీపీ ప్రభుత్వంలో కోట్లమంది ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే కూల్చేసింది. దానిపక్కనే చంద్రబాబుగారి నివాసం. ఆ నివాసం అక్రమ కట్టడం అయితే దాన్నెందుకు కూల్చలేదు? చంద్రబాబుగారిని అమరావతిలో ఉండకుండా చేయడానికి జగన్ అతని ప్రభుత్వం ప్రకాశం బ్యారేజ్ లో పరిమితికి మించి నీళ్లు నిల్వచేసింది. చంద్రబాబు ఏమీ జగన్మోహన్ రెడ్డిలా అవి నీతిసొమ్ముతో భారీ ప్యాలెస్ లు నిర్మించుకోలేదనే వాస్తవాన్ని కేతి రెడ్డి తెలుసుకోవాలి.

తన ఆస్తులు, భూముల్ని బినామీలపేరుతో పెట్టి, తనకు ఏమీలేవని చెప్పడం కేతిరెడ్డికి అలవాటే. కేతిరెడ్డి కొన్నభూమి ఎంత.. ఆక్రమించుకున్నది ఎంత? అనేది ఆయనే సర్వే చేయించి, వాస్తవాలు ప్రజలముందు పెట్టాలి. గుర్రాలకోటపై కేతిరెడ్డి నిర్మించిన భారీభవనంపై ఆయనే స్పందించాలి. దాని వీడియో తీసి తాము ధర్మవరం ప్రజలముందు ఉంచితే కేతిరెడ్డి ఎందుకు ఉలిక్కిపడ్డాడు? 25ఎకరాలు తా నుకొని ఫామ్ హౌస్ కొట్టుకున్నానని కేతిరెడ్డి చెబుతున్నారు. ఎమ్మెల్యే అయినంత మాత్రాన విలాసవంతమైన జీవితం గడపాలని కేతిరెడ్డి అనుకోవడం సరైందేనా? ఆయనకు ఫామ్ హౌస్ లు కట్టుకోవాలన్న కోరిక ఉంటే, తనసొంత ఊరిలో కట్టుకోవచ్చు. అక్కడ ఆయన జీవితం 10ఎకరాలతో మొదలైంది. నేడు వందలఎకరాలు ఎలావచ్చాయో కేతిరెడ్డే చెప్పాలి. నిజంగా కేతిరెడ్డి అతి తక్కువ సమయంలో ఇన్నివేలకోట్లు ఎలా సంపాదించాడు? ధర్మవరం చుట్టుపక్కల వందలఎకరాలు ఎలావచ్చాయి? బినామీలపేర్లతో ఆస్తులుపెట్టిన కేతిరెడ్డి, ఎన్నికల అఫిడవిట్లో ఏమీలేవని చెబుతున్నాడు.

27.38ఎకరాల భూమి తానుకొన్నట్లు కేతిరెడ్డి చెబుతున్నాడు. కానీ వాస్తవంలో మాత్రం 45 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఆ భూమికి సంబంధించిన పత్రాలు కూడా దొరక్కుండా చేశారు. గాలి వసుమతి (కేతిరెడ్డి తమ్ముడి భార్య) కర్నూలుజిల్లా బనగానపల్లెకు చెందిన మహిళ. ఆమెకు ధర్మ వరం చుట్టుపక్కల పిత్రార్జితంగా భూములు ఎలా వచ్చాయో కేతిరెడ్డి చెప్పాలి. భూములు ఆక్రమించే తొందర్లో కేతిరెడ్డి తప్పు చేశాడు. సర్వే నెంబర్ 908-1లో 5ఎకరాలు, 904 –సీ లో 3ఎకరాల భూమి ఎక్కడిది? 40ఎకరాల భూమి ఉంటే సర్వేచేయండి.. అని మాతో అన్నాడు. ఆ భూమి ఎవరితో తాము నిరూపించాల్సిన పనిలేదు. అధికారులతో సర్వే చేయించితే, అక్కడ ఎవరిభూమి ఎవరిపేరుతో ఎంత ఉందో చుట్టుపక్కల రైతులే చెబుతారు. తనకింద పనిచేసే అధికారులతో సర్వేచేయించి, ఆసర్వేను ప్రజలకు లైవ్ లోచూపించే ధైర్యం కేతిరెడ్డికి ఉందా? ఎస్సీ వర్గానికిచెందిన కలెక్టర్ పై మాటలదాడి ఎందుకు జరిగిందో కూడా ధర్మవరం ఎమ్మెల్యే చెప్పాలి? నారా లోకేశ్ కేతిరెడ్డి అవినీతికి సంబంధించి చిన్నవేలే పెట్టారు .. మొత్తం చెయ్యి పెడితే పరిస్థితి ఎలాఉంటుందో ఊహించుకోండి.

బోట్ రైడింగ్ కోసం వెంకట్రామిరెడ్డి ధర్మవరం ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. హార్స్ రైడింగ్ లతో ధర్మవరం ఎమ్మెల్యే తానో రాజులా ప్రవర్తిస్తున్నాడు
వెంకట్రామిరెడ్డికి బోట్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. దానికోసం రైతులు పండించే ఆయకట్టుకి నీరు ఇవ్వలేదు. రైతులు కంపచెట్లు పీకుతారు..పీకరు. దానికోసమని ధర్మవరం చెరువు ఆయకట్టుకి నీళ్లు ఇవ్వరా? ధర్మవరం చెరువు నింపడానికి చంద్రబాబుగారి హయాంలో హంద్రీనీవా కాలువద్వారా నీళ్లు తెప్పించారు. రైతులు పంటల్ని కాపాడుకోవడానికి లీటర్ నీటికి దాదాపుగా రూ.20లు చెల్లిస్తున్నారు. వారి బాధకంటే తనకు బోట్ రైడింగ్ లే ఇష్టమని ఎమ్మెల్యే అనడం సిగ్గుచేటు. కేతిరెడ్డి గుర్రాల రైడింగ్ కూడా ఇష్టమంటున్నాడు. తాను ఎంత ఎమ్మెల్యే అయినా గుర్రాలపై రోడ్లపై పరిగెత్తుతూ, పెద్దాచిన్నా అనే గౌరవం లేకుండా ప్రవర్తి స్తున్నాడు. ప్రజలమధ్యలో తానో రాజులా ప్రవర్తిస్తున్నాడు.

కేతిరెడ్డి అవినీతి, అక్రమాలపై టీడీపీప్రభుత్వం రాగానే నిగ్గుతేలుస్తాం.. అప్పుడు కేతిరెడ్డి స్టేలు తెచ్చుకుంటాడో.. గుడ్ మార్నింగ్ పేరుతో కార్యక్రమాలు చేస్తాడో చూస్తాం. స్టేలు తెచ్చి మేనేజ్ చేసుకోవడానికి తామేమీ వివేకానందరెడ్డి హత్యకేసులో ముద్దాయిలం కాము. స్టేలు తెచ్చుకొనేంత నాలెడ్జ్ కేతిరెడ్డికి ఉంటే, రేపు టీడీపీప్రభుత్వం వచ్చాక ఆయన ఆస్తులపై జరిపే విచారణపై స్టే తెచ్చుకోవచ్చు. అంతా నాకే తెలుసన్నట్టు కేతిరెడ్డి మాట్లాడితే సరిపోదు. ధర్మవరం ఎమ్మెల్యే చెప్పకుండానే అధికారులు చేశారంటే ప్రజలు నమ్ముతారా? కేతిరెడ్డిని కేటుగాడు అంటేనే అంత ఫీలయ్యాడు. మరి సోషల్ మీడియాలో కేతిరెడ్డిచేస్తున్న ఓవరాక్షన్ల సంగతేమిటి? పిల్లల్ని తిడితే హీరో అయిపోవచ్చు అనుకుంటున్నాడా?

కేతిరెడ్డి ఇసుకవ్యాపారం, అక్రమ భూదందాలు, శ్మశానాల కబ్జాలు అన్నింటిపై తమపార్టీ అధికారం లోకి వచ్చినవెంటనే విచారణ జరిపిస్తాం. 3 లక్షల క్యూబిక్ మీటర్లకు ఇసుకతవ్వకాలకు అనుమతి ఇచ్చి, వేబ్రిడ్జిలు కూడా లేకుండా ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. కేతిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికి ఇస్తున్నారో తెలుసుకోవాలి. వెంకట్రామిరెడ్డి తండ్రిపై బాంబులు పడినప్పుడు బండిపంపిన పరిటాల రవి కొడుక్కి, లోకేశ్ టిక్కెట్ ఇస్తున్నారని తెలుసుకో. కేతిరెడ్డి తండ్రి చనిపోయినప్పుడు హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్లి, ఆకుటుంబానికి ధైర్యంచెప్పిన సునీతమ్మ కొడుక్కి సీటు ఇస్తున్నారని తెలుసుకో. మా కుటుంబం మమ్మల్ని నమ్ముకున్నవారికోసం పోరాడింది. మాపెద్దలు, మానాయన, తెలుగుదేశంపార్టీ నమ్ము కున్న వారిని రక్షించుకోవడానికి పోరాడింది. కానీ కేతిరెడ్డి పాము తనపిల్లల్ని తానే తిన్నట్టు, నమ్మినవారినే నాశనంచేస్తున్నాడు. ఆ విషయాలన్నీ బయటకువస్తాయి. పచ్చి బాలింతను చంపినవారిని పక్కనపెట్టుకున్న కేతిరెడ్డి బాగోతం మొత్తంబయటకు వస్తాయి. కేతిరెడ్డి కేరెక్టర్, పద్ధతి, అతని ఆలోచనలు ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా చెబుతాం.

తెలుగుదేశాన్ని గెలుక్కుంటే కేతిరెడ్డి భూస్థాపితం అవుతాడు. ఆదాయార్జన, అవినీతిపై పెట్టేశ్రద్ధలో సగమైనా కేతిరెడ్డి, తనకుఓట్లేసిన ప్రజలపై, వారిసమస్యల పరిష్కారంపై పెడితే మంచిది. కేతిరెడ్డి భూదోపిడీలతో ఆగకుండా శ్మశానాల దోపిడీకి కూడా సిద్ధమయ్యాడు. ఎలాంటి సర్వే లకు అయినా తాముసిద్ధమే. జగన్మోహన్ రెడ్డికూడా రాష్ట్రంగురించి, ప్రజల గురించి ఏం చేస్తున్నాడో తెలియాలంటే కేతిరెడ్డి ఆయనతో కూడా గుడ్ మార్నింగ్ కార్యక్రమం పెట్టించాలి. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఫన్ లెస్ ప్రోగ్రామ్. గమ్యంలేని ప్రయాణాలుచేసేవారు, పని లేకుండా ఏదో పనిచేస్తున్నట్టు నటించేవారు చేసేమాదిరి, ధర్మవరం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఉందని ప్రజలే చెబుతున్నారు. నిజంగా ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమం పెట్టాలనుకుంటే గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించడానికి చేయాలి.”

LEAVE A RESPONSE