– ఈటె స్వామి దాస్ డిమాండ్
రాష్ట్రంలో చర్చి ఉన్న ప్రతి పాస్టర్ కి గౌరవ వేతనం ఇవ్వాలని క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాస్టర్స్ గౌరవ వేతనానికి నిధులు వెంటనే విడుదల చేయాలని క్రిస్టియన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ వలీ కీ సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఈటె స్వామిదాసు మాట్లాడుతూ.. పాస్టర్స్ గౌరవేతనం గత మూడు నెలలుగా పాస్టర్స్ కి రావడం లేదని,నెల నెల ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండవ దఫాలో పాస్టర్స్ గౌరవేతననికీ ఆన్లైన్ చేసుకొని 9 నెలలు అవుతున్న ఇంతవరకు ఒక నెల గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని వాపోయారు. 9 నెలల గౌరవ వేతనం వెంటనే విడుదల చేయాలని కోరారు.
చర్చిఉన్న ప్రతి పాస్టర్ కి గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో 60వేల మంది పాస్టర్లు ఉంటే కేవలం 5196 మంది పాస్టర్స్ కు మాత్రమే ఇస్తున్నారని అదికూడా సక్రమంగా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందినన్నారు.గౌరవ వేతనాని కి నిధులు మంజూరు చేయక పోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు