– రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ స్పెషల్ సాంగ్ కరీంనగర్ లో రిలీజ్ చేసిన నేతలు
– ఇప్పటికే సంచలనం స్రుష్టిస్తున్న సాంగ్ ప్రోమో
– రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకు యూత్ లో మస్త్ క్రేజ్
ఈనెల 14 నుండి రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాదయాత్రకు సంబంధించిన సెన్షెషనల్ సాంగ్ విడుదలైంది.‘‘పాతబస్తీలో దుమ్మ దుమారం’’ పేరిట రూపొందించిన స్పెషల్ సాంగ్ ప్రోమో ఇప్పటికే విడుదలై సంచలనం స్రుష్టించిన సంగతి తెలిసిందే. లక్షలాది యువతను ఈ ప్రోమో ఉర్రూతలూగించింది.
ఈ సాంగ్ ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని యువత ఎదురు చూస్తున్న క్రమంలో కొద్ది సేపటి క్రితం రాహుల్ సిప్లిగంజ్ సమక్షంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, యువ నాయకుడు ఆశీష్ గౌడ్ కరీంనగర్ లో ఈ పాటను విడుదల చేశారు.
ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకు విశేషాదరణ లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రముఖ రచయిత, బండి సంజయ్ వీరాభిమాని ఆకుల నాగేశ్వరరావు రచించిన ఈ పాటకు నరేష్ ఎడిటర్ గా పనిచేయగా… ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి టీం సభ్యుడైన జీవన్ బాబు సంగీత దర్శకత్వం వహించారు.
మొదటి విడత పాదయాత్ర సక్సెస్, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద బీజేపీ నిర్వహించిన సభతో పాతబస్తీ కాషాయమయమైన తీరు, బండి సంజయ్ ధైర్యసాహసాలు, హిందుత్వ నేపథ్యాన్ని ఉటంకిస్తూ నాగేశ్వర్ రావు తనదైన శైలిలో పదాలతో రూపొందించిన ఈ పాట విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో విజయవంతమైన పాటల్లో మెజారిటీ దాదాపు నాగేశ్వరరావు కలం నుండి జాలు వారినవే కావడం విశేషం. తొలివిడత పాదయాత్ర సక్సెస్ నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో నాగేశ్వరరావు కలం నుండి జాలు వారిన ఈ పాటకు ఈసారి బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ ఇవ్వడంతో మరింత మాస్ లుక్ వచ్చింది. స్పెషల్ సాంగ్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను చేరుకోవడం విశేషం.