Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డికి చివాట్లు పెట్టిన సమగ్రశిక్ష అభియాన్ నివేదిక

-అస్థవ్యస్థమైన విద్యా వ్యవస్థపై జగన్ రెడ్డికి చివాట్లు పెట్టిన సమగ్రశిక్ష అభియాన్ నివేదిక
-రూ.2వేల కోట్ల ప్రపంచ బ్యాంక్ అప్పు కోసం విద్యార్ధుల భవిష్యత్ తాకట్టు
-రాష్ట్ర వ్యాప్తంగా 8వేల ప్రభుత్వ పాఠశాలలను మూయించేస్తున్న జగన్ రెడ్డి
-2.80 లక్షలు తగ్గిన ఎన్ రోల్ మెంట్ – 31.3 శాతానికి ఎగబాకిన డ్రాప్ అవుట్ రేట్
-నాడు నేడు పేరుతో వేల కోట్లు అవినీతికి పాల్పడి దోచుకుంటున్న జగన్ రెడ్డి
-ప్రభుత్వ పాఠశాలలను మూయిస్తున్నారు – ఉపాధ్యాయులను నడిరోడ్డుకీడుస్తున్నారు
-50వేల టీచర్ల పోస్టుల నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగులకు అన్యాయం
-విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులను నయవంచన చేస్తున్న జగన్ రెడ్డి
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

జగన్ రెడ్డి అమలు చేస్తున్న లోపభూయిష్టమైన విద్యా విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్ పూర్తిగా అంథకారంలోకి వెళుతుంది. లక్షల మంది విద్యార్ధులు విద్యకు దూరం అవుతున్నారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు చదివే విద్యార్ధులు నేడు అస్థవ్యస్థలకు గురి అవుతున్నారు. స్కూళ్ల విలీనంతో దాదాపు 8వేల పాఠశాలలు మూతబడుతున్నాయి. తన అవినీతి కోసం ఏదో రకంగా ఖజానాలోకి డబ్బులను తీసుకువచ్చి వాటిని మింగేందుకు లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్ సర్వనాశనం చేస్తున్నారు. ఉపాధ్యాయ నియమకాలు జరగకపోవడం వలన ఉపాధ్యాయులపై పని భారం పడటంతో పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఉధ్యమాలు చేయాల్సిన పరిస్థితి. స్కూళ్లు రూపరేఖలు మారుస్తున్నానని జగన్ రెడ్డి ఘనంగా ప్రకటించుకున్నారు. కాని ఆయన దెబ్బకు స్కూళ్లకు స్కూళ్లే మాయమవుతున్నాయి. మా భవిష్యత్ ను అంథకారంలోకి నెట్టొద్దు, మా స్కూళ్లు మూయోద్దని విద్యార్ధులు జగన్ రెడ్డిని వేడుకునే దుస్థితికి దిగజార్చారు. మరో వైపు తల్లిదండ్రులు సైతం పనులు మానుకొని విద్యార్ధులకు అండగా నిలవాల్సిన పరిస్థితి. జగన్ రెడ్డి మాటల్లో ఒక్క మాట కూడ నిజం లేదు. Samagra Siksha Abhiyan, Project Approval Board, Ministry of Education, Govt. of India వారి మీటింగ్ మినిట్ల్స్ చూస్తే జగన్ రెడ్డి బండారం భయటపడుతుంది. ప్రతి ఏడాది సమగ్ర శిక్ష అభియాన్ నుంచి రాష్ట్రానికి నిధులు వస్తాయి. ఆ నిధులు విడుదల చేసే సమయంలో ఆయా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలాగుందో రాష్ట్రానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.

జూన్ 10, 2022న డిల్లీలో జరిగిన సమావేశం మినిట్స్ లోని రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మినిట్స్ నివేదికలో ఎన్ రోల్ మెంట్, డ్రాప్ అవుట్ విషయంగా ‘‘Decline in enrollment and high drop out rate: The decline in enrolment in the state quite high at 2.80 lakh”. నేడు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎన్ రోల్ మెంట్ 2లక్షల 80వేలకు తగ్గిపోయిందని మినిట్స్ లో పై విధంగా పేర్కొన్నారు. దీనికి ఏం సమాధానం చెబుతావు జగన్ రెడ్డి? (The Grade wise Annual average drop out rate at class 10 is at 31. 3%) కేంద్ర చెబుతున్న దాని ప్రకారం 10వ తరగతిలో 31.3 శాతం డ్రాప్ అవుట్ రేటు ఉంది. ఇది జగన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సాధించిన ప్రగతి. (The Average annual dropout rate at the secondary level in 2021 is also quite high at 16.7%). 2021 సెకండరీ లెవల్ లో యాన్యువల్ డ్రాప్ అవుట్ రేట్ 16.7 శాతంగా ఉంది. (State needs to take immediate steps to reduce the dropout rate) రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డ్రాప్ అవుట్ రేట్లు తగ్గించాలని కేంద్రం చెబుతుంది. అంతే కాకుండా ఆ నివేదికలో (Declaine in transmission rate: transmission from secondary to higher secondary level is very low) అదే విధంగా ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్లే టాన్సిషన్ రేటు చాలా తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. (Pupil teacher ratio – The number of Schools with adverse PTR. Is also quite high at 47.56% at primary level, 17.93% Upper Primary level, state needs to correction this) విద్యార్ధి, ఉపాధ్యాయుని నిష్పత్తి కూడా ప్రమాదకరంగా ఉంది. ఉపాధ్యాయుల కొరతను ఎత్తి చూపి దీనిని ప్రభుత్వం వెంటనే సరిచేసుకోవాలని నివేదికలో ఉంది. అంతే కాకుండా (There are 39,008 vacant posts of teachers in Govt elementary schools) ఏపీలోని ప్రాథమిక పాఠశాలల్లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అదే విధంగా (There are 11,888 vacant posts of teachers in Govt secondary schools) ప్రాథమికోన్నత పాఠశాలల్లో 11,888 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మొత్తంగా 50,896 టీచర్ పోస్టులు భర్తీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఖాళీగా ఉన్నాయని ఘాటుగా నివేదకలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ఉపాధ్యాయ నియామకాలు జరపకపోవడం వలన విద్యార్ధులు తీవ్రంగ నష్టపోతున్నారని కేంద్రం చెప్పింది. దీనికేం సమాధానం చెబుతావు. (Primary level single teacher schools have increase from 7,800 to 10,065) ఉపాధ్యాయ నియమకాలు జరపకపోవడం వలన ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య కూడా భారీగా పెరిగిందని అన్నారు. కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన నివేదిక ద్వారా స్పష్టంగా జగన్ రెడ్డి విద్యా వ్యవస్థను ఏ రకంగా నాశనం చేస్తున్నాడో అర్ధమవుతుంది.

మరో వైపు జగన్ రెడ్డి తన అవినీతి దాహాన్ని తీర్చుకోవడం కోసం విద్యార్ధుల భవిష్యత్ ను కూడా తాకట్టు పెడుతున్నారు. జీవో నెం.04, School Education, dated 30, Jan, 2022 ఈ జీవో పరిశీలిస్తే జగన్ రెడ్డి అవినీతి బండారం బయటపడుతుంది. ఈ జీవో ప్రకారం SALT (Supporting Andhra’s Learning Transformation) ఈ పథకం కోసం రూ.2వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకువస్తున్నారు. (Supporting Andhra’s Learning Transformation project with loan assistance of US dollars 250 million (2,000 crores) from World Bank for supporting various initiative in school education like Nadu Nedu, introducing English Media etc., Via supporting SALT Operation, “Subject to Condition that the department shall avoid increase in recurring Human Resource(HR) expenditure by keeping the additional requirement if any to bare minimum”) దీని ద్వారా చాలా స్పష్టంగా ఉపాధ్యాయ నియామకాలు జరపకపోవడానికి కారణం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.2వేల కోట్లు తీసుకోవడానికి బ్యాంక్ పెట్టిన షరతుకు అంగీకరించడమే. మానవ వనరులపైన పెట్టే ఖర్చు పెరుగుదలను మానుకోవాలని అంతేకాకుండా భవిష్యత్ నియామకాలను తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంక్ విధించిన షరతుకు నిసిగ్గుగా రాష్ట్రంలోని బిడ్డలను భవిష్యత్ ను పట్టించుకోకుండా జగన్ రెడ్డి అంగీకరించాడు. గత మూడు ఏళ్లుగా డీఎస్సీ నియామకాలు జరపకపోవడానికి ప్రస్తుతం అదనపు ఉపాధ్యాయ నియమకాలు చేపట్టకపోవడానికి అసలు కారణం ఈ ప్రపంప బ్యాంక్ రుణం. ఏదో ఒక విధంగా ఖజాలోని రూ.2వేల కోట్లు తీసుకువచ్చి దానిని లూటీ చేయడం కోసం జగన్ రెడ్డి దుర్మార్గంగా ఇటువంటి షరతులకు ఒప్పుకున్నాడు. ఇటువంటి దుర్మార్గపు పనులను కప్పిపుచ్చుకోవడానికే జీవోలన్ని దాచిపెడుతున్నది? రూ.2వేల కోట్ల రుణం కోసం విద్యార్ధుల భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు.

జగన్ రెడ్డి చేస్తున్న కుట్రను విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరుద్యోగ యువత అందరూ తెలుసుకోవాలి. జీవో నెం. 04కి లోబడి స్కూల్స్ విలీనం పేరుతో స్కూల్స్ తగ్గించేసి, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా ఉన్న టీచర్లతోనే సరిపెడుతూ అటు విద్యార్ధులు, ఇటు ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయంగా ప్రజలకు సమాధానం చెప్పాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. ఇటువంటి చర్యలు చూసిన తరువాత జగన్ రెడ్డి పిల్లలకు మేనమామ కాదు కంసమామ అని అనుకోకతప్పదు. డీఎస్సీ వస్తుంది, టీచర్ల నియామకం జరగుతుందని లక్షలాది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 0.5 శాతం రుణాల పెంపుదల కోసం మోటర్లకు మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు ఏ విధ:గా బిగించాడో నేడు రూ.2వేల కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం కోసం స్కూళ్లను మాయం చేస్తూ, ఉపాధ్యాయుల నియామకం చేపట్టకుండా విద్యార్ధుల మెడకు ఉరితాడు బిగిస్తున్నాడు జగన్ రెడ్డి. ఈ జీవో చదివిన తరువాత ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రంలోని లక్షలాది మంది ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఇక వాటిపై తమ ఆశలు వదులుకోవడమేనని చెప్పక తప్పదు.

గతంలో జీవో నెం. 84, 85 ప్రకారం 3,4,5 తరగతుల విద్యార్ధులు 3 కి.మీ. దూరంలో పాఠశాలలు విలీనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీవో నెం. 117 విడుదల చేసి ఉపాధ్యాయులపై పని భారం పెంచుతూ ఆఖరికి తరగతులలో విద్యార్ధుల సంఖ్యను కూడా అమాంతం పెంచేశారు. గతంలో ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి 30 మందికి మించి ఉండటానికి వీలు లేదు. కాని నేడు విలీనం పేరుతో 30 నుంచి 40కి విద్యార్ధుల సంఖ్యను పెంచేసి తరగతి గదులలో కుక్కేశారు, అదే ప్రాథమిక్కోన్నత పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను 35 నుంచి 52కి పెంచారు, ఉన్నత పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను 40 నుంచి 60కి పెంచారు. పాఠశాలల్లో విద్యార్ధులను కుక్కేసి ఉక్కిరి బిక్కిరి చేసి వారిని చదువుకు దూరం చేస్తున్నారు. ఉపాధ్యాయ, విద్యార్ధి నిష్పత్తి మార్గదర్శకాలను కూడా పూర్తిగా గాలికి వదిలేశారు.

పుస్తకాల్లేని చదువులు, అనేక పాఠశాలల్లో చేరని టెస్ట్ పుస్తకాలు, నాశిరకం బ్యాగ్ లు ఇది జగన్ రెడ్డి విద్యా కానుక. దీని కోసం నీ అవినీతి పత్రికలో భారీ ప్రకటనలు దానికి వందల కోట్ల ప్రజాధనం వృధా. మూడేళ్లల్లో విద్యా కానుక కోసం రూ.2,368 కోట్లు తన సొంత ఖజానా నుంచి ఇచ్చానాని డాబులు చెప్పుకుంటున్నారు జగన్ రెడ్డి కాని మార్చి, 12, 2020న విడుదల చేసిన జీవో నెం. 12లో ఆ సంవత్సరం విద్యా కానుక కింద ఖర్చు చేసిన రూ.650 కోట్లల్లో కేంద్రం రూ.393 కోట్లు ఇచ్చింది, కాని మార్చి 10, 2021న విడేదల చేసిన జీవో నెం. 21లో రూ.732 కోట్లల్లో రూ.230 కోట్లు కేంద్రం ఇచ్చిందని అంటే దాదాపు 40 శాతం నిధులు కేంద్రం ఇస్తుందని రహస్య జీవోలలో పేర్కొన్న జగన్ రెడ్డి నేడు సొమ్మంతా తన జేబుల్లో నుంచి ఇస్తున్నట్లుగా పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు. తెలుగుదేశం హయాంలో కూడా విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగ్స్, బూట్లు ఎటువంటి ప్రాచార్భాటం లేకుండా ఇవ్వడం జరిగింది. నేడు జగన్ రెడ్డి కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేదు. అదే విధంగా 8,9 తరగతుల విద్యార్ధినులకు సైకిళ్లు పంపిణి చేస్తే, నేడు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటిని పక్కన పెట్టి తుప్పు పట్టించారు. పిల్లలకు సరఫరా చేసే చిక్కీలో రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కోడిగుడ్లల్లోను అవినీతికి పాల్పడి దోచుకుంటున్నారు. కేంద్రం పాఠశాలల మెయింటెనెన్స్ కోసం ఇచ్చే కాంపోజిట్ గ్రాంట్ ను కూడా లాగేసుకున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రతి ఏడాది రూ.25వేలు, ఉన్నత పాఠశాలలకు విద్యార్ధుల సంఖ్యను బట్టి రూ.50 నుంచి లక్ష రూపాయల వరకు కేంద్రం ఇస్తుంది. గత ఏడాది రూ.122 కోట్ల నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించి మింగేశారు. నాడు నేడు అవినీతి పుట్ట. పాఠశాలల్లో సీలింగ్ పెచ్చులు ఊడి విద్యార్ధులకు గాయాలయిన సంఘటనలు అనేకం చూశాం. నేడు విద్యార్ధులు బ్లాక్ బోర్డ్ వంక చూడటం మానేసి సీలింగ్ వైపు చూస్తూ పాఠాలు వింటున్నారు.

ఈ విధంగా జగన్ రెడ్డి తన అవినీతి కోసం చేపడుతున్న అస్థవ్యస్థ విద్యా విధానాలకు బలై ఉధ్యమిస్తున్న విద్యార్ధులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయ నియమకాల కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

LEAVE A RESPONSE