– యు.ఎస్.ఎఫ్.డి.ఏ (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ) పరిశోధనలో బట్టబయలైన అరబిందో ఫార్మా కల్తీ మందుల వ్యవహారం
– జనవరి 12, 2022 న యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు అరబిందోకి రాసిన ఘాటైన లేఖలో ఈ కల్తీ విషయంపై తీవ్ర హెచ్చరికలు జారీ
– ఇసుక, మద్యం, మైనింగ్, అక్రమాలతో తన ధనదాహం తీరక నేడు అత్యంత క్రూరంగా తన బినామీ – కంపెనీల ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో సైతం కల్తీలకు పాల్పడుతూ కోట్లు మింగుతున్న జగన్ రెడ్డి
– ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఫార్మా కంపెనీ ధనదాహంతో వారి ప్రాణాలతో చెలగాటమాడటం అత్యంత బాధాకరం
-తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి
జగన్ రెడ్డి ముఠా నిన్నటి వరకు మద్యం కల్తీలకు పాల్పడి… నేడు ప్రజలు ప్రాణాలు కాపాడే మందుల్లో సైతం కల్తీకి పాల్పడతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరులు సమావేశం లో ఆయన మాట్లాడారు.
అరబిందో ఫార్మాలో తయారవుతున్న నాశిరకం కల్తీమందులపై ఆయన మాట్లాడుతూ…. మద్యంలో కల్తీ జరిగిన విషయం బయటపడి రెండు రోజులు గడవక ముందే ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా జగన్ రెడ్డి ముఠా కల్తీకి పాల్పడుతున్న వ్యవహారం నేడు బయటపడిందని అన్నారు. అనారోగ్యంతో ఉన్న వారు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పులు చేసి మరీ మందులు కొని వాడుతుంటారు. అలాంటి మందుల్లో కూడా జగన్ రెడ్డి ముఠా కల్తీకి పాల్పడుతోందంటే అత్యంత బాధాకరం, దుర్మార్గం.
ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన యు.ఎస్.ఎఫ్.డి.ఏ (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ) పరిశోధనలో అరబిందో ఫార్మా కంపెనీలో కల్తీ మందులు తయారవుతున్నాయని సంచనల విషయాలు బయటపెట్టింది. కల్తీకి పాల్పడుతున్న అరబిందో ఫార్మా చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, బినామీ. ఏ2 విజయసాయి రెడ్డికి స్వయానా వియ్యంకుడు. గతంలో జగన్ రెడ్డి అరబిందో ఫార్మాకు రాష్ట్రంలోని మొత్తం అంబులెన్సుల వ్యవస్థను కట్టబెట్టి రూ.307 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.
యు.ఎస్.ఎఫ్.డి.ఏ ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికం కలిగిన సంస్థ. వారు ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న మందులను పరీక్షించి, వాటి నాణ్యతను దృవీకరిస్తారు. అలాంటి యు.ఎస్.ఎఫ్.డి.ఏ అరబిందో ఫార్మాలో తయారయ్యే మందుల్లో కల్తీ జరుగుతున్నదని, కల్తీని నివారించకపోతే అమెరికాలో అరబిందో మందులను నిషేదిస్తామని వార్నింగ్ లేఖలు రాసారు.
సెక్యురిటీస్ ఎక్సేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వారు యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు రాసిన లేఖపై అరబిందోను గట్టిగా ప్రశ్నించి పూర్తి వాస్తవాలు తమకు అందజేయాలని జూన్ 24 న లేఖ రాయడంతో ఈ కల్తీ మందుల వ్యవహారం బయటపడింది.
యు.ఎస్.ఎఫ్.డీ.ఏ అడిట్ డిస్ క్లోజర్స్ కు సంబందించి అరబిందోకు సెబీ చేసిన హెచ్చరికలు జాతీయ మీడియాలో సంచలనాత్మకంగా ప్రచురింపబడ్డాయి. అరబిందోలో తయారవుతున్న మందుల్లో కల్తీ జరుగుతున్న విషయాన్ని, యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు అరబిందోకు రాసిన వార్నింగ్ లేఖలను దాచిపెట్టిండంతో ఎక్సేంజీలో లిస్టెడ్ కంపెనీగా ఉన్న అరబిందోకు సెబీ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇందులో “the company (Arabindo) had disclosed very limited and restricted information on USFDA warnings and that the company did not disclosed detailed reasons and also did not considered the observations of USFDA” అని అరబిందో గురించి సెబీ తీవ్ర హెచ్చరికలు చేసింది. యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారి సూచనలు కూడా అరబిందో లెక్కచేయలేదని సెబీ చెప్పింది.
దీనిబట్టి జగన్ రెడ్డి దొంగల ముఠా ప్రజలు వాడే మందుల్లో కూడా ఎంత నిసిగ్గుగా కల్తీకి పాల్పడుతున్నరో అర్ధమౌతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారే కల్తీ జరుగుతుందని చెప్పారంటే జగన్ రెడ్డి దొంగల ముఠా ప్రజల ప్రాణాలతో ఎంతలా చెలగాటమాడుతున్నారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. యు.ఎస్.ఎఫ్.డి.ఏ క్వాలిటీ డైరక్టర్ ప్రాన్సిస్ గాడ్విన్ జనవరి 12, 2022 న అరబిందోకి రాసిన లేఖలో కల్తీకి సంబంధించి అనేక విషయాలు రాసారు. ఆగష్టు, 2021 లో తెలంగాణ బోరపట్ల గ్రామంలోని అరబిందో ఫార్మా యూనిట్ ను పరిశోధించి అరబిందో ఫార్మా వారు ప్రోడక్షన్ లో, ప్యాకేజింగ్ లో సి.జి.ఎం.పి. (కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్) ప్రమాణాలు పాటించడం లేదని చెప్పారు….‘Your methods, facilities or controls for manufacturing, processing and packing do not conform to CGMP’ అని చాలా స్పష్టంగా తెలిపారు. అదేవిధంగా అరబిందోలో తయారైతున్న ఏపీఐ (యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇన్ గ్రీడియంట్స్) లో కల్తీ జరుగుతోందని విస్పష్టంగా తెలిపారు…. “Your API (Active pharmaceutical ingredients) are adulterated within the meaning of section 501 (A) (2) (B) of FD&C Act” అరబిందో మందుల తయారీలో వాడుతున్న పదార్ధాలు ఫెడరల్ పుడ్, డ్రగ్ అండ్ కాస్మొటిక్ యాక్ట్ – సెక్షన్ 501 (A) (2B) కింద సరైనవి కావని, కల్తీవని వారి లేఖలో పేర్కొన్నారు.
అంతేకాకుండా యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు గుర్తించిన అంశాలపై అరబిందో వారు ఇచ్చిన సమాధానాలు సరిగా లేవని, వాటిని సరిదిద్దే ప్రయత్నం గానీ, వాటిపై కనీసం లోతైన విచారణ గానీ చేయలేదని చాలా ఘాటుగా అభిప్రాయపడింది. మందుల ఉత్పత్తిలో పాటించాల్సిన కనీస జాగ్రత్తలు, చేపట్టాల్సిన కనీస నియంత్రణలు గానీ అరబిందో యాజమాన్యం పాటించడం లేదని యు.ఎస్.ఎఫ్.డి.ఏ తెలిపింది. అంతేకాకుండా తక్షణం దిద్దుబాటు చర్యలు పాటించకపోతే అరబిందో పార్మా చేసుకున్న కొత్త ప్రతిపాదనలను నిలిపివేయడమే కాకుండా అమెరికాలో అరబిందో మందులు ప్రవేశించకుండా నియంత్రిస్తామని యు.ఎస్.ఎఫ్.డి.ఏ తన లేఖలో హెచ్చరించింది. “Failure to address any deviations may also result in the FDA refusing admission of articles manufactured by Aurobindo Pharma Ltd. Into the United States under section 801(a) (3) of FD&C act”
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ తమ సంస్థపై ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేసినందుకు అరబిందో సిగ్గుపడాలి. అరబిందో రాష్ట్ర ప్రతిష్టనే కాకుండా, దేశ ప్రతిష్టను సైతం మంటగలుపుతోంది. యు.ఎస్.ఎఫ్.డి.ఏ కి చెందిన మ్యానిఫ్యాక్చరింగ్ క్వాలిటీ డైరక్టర్ ప్రాన్సిస్ గాడ్విన్ జనవరి, 12, 2022 న లేఖ రాస్తూ అనేక కల్తీ అంశాలను ప్రస్తావించారు. తన బినామీ పీ.వి రాంప్రసాద్ రెడ్డికి చెందిన అరబిందో ఫార్మాలో జరిగిన కల్తీ మందుల వ్యవహారంపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? ఇలాంటి కల్తీ మందుల కంపెనీయైన అరబిందోకు 108, 104 వాహనాల బాధ్యతలు అప్పచెప్పిన జగన్ రెడ్డిని ఏం చేయాలి?
జగన్ రెడ్డి, తన బినామీలు జేబులు నింపుకోవడానికి ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. జూన్ 20, 2019 న కూడా యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు అరబిందో ఫార్మాకు మరో లేఖ రాసారు. ఇందులో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉన్న అరబిందో ఫార్మా యూనిట్ లో సైతం కల్తీ పదార్ధాలు కనుగొన్నామని యు.ఎస్.ఎఫ్.డి.ఏ వారు హెచ్చరించారు. అయినా అరబిందో ఫార్మా తన పద్ధతి మార్చుకోలేదు. అదే తప్పుడు పనులకు పాల్పడుతుండటంతో యు.ఎస్.ఎఫ్.డీ.ఏ జనవరి 12, 2022న రెండవసారి హెచ్చరికలు జారీ చేసింది. దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు?
అరబిందో ఫార్మా, హెటెరో ఫార్మాలు అవినీతిమయం. జగన్ రెడ్డి బినామీ హెటిరో ఫార్మా పార్థసారధి రెడ్డి రెమెదెసెవర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెటింగ్ చేసి ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలకు విదితమే. వీటికి సంబంధించి పత్రికల్లో వివిధ శీర్షికలతో వార్తలు వెలువడ్డాయి. ‘‘నల్లబజారులో రెమెదెసెవర్’’, ‘‘మెడిసన్ మాఫియా’’, ‘‘బజారులో ధర 325 అయితే బ్లాక్ లో 50 వేల నుంచి లక్షా’’ అంటూ శీర్షికలతో వివిధ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వీటిని బట్టి కరోనా సమయంలో కూడా ఏ రకంగా దోచుకున్నారో అర్థమవుతోంది. హైదరాబాద్ లోని హెటిరో ఫార్మా కంపెనీపై ఐటీ శాఖ వారు జరిపిన దాడిలో బీరువాలు బీరువాలు నోట్ల కట్టలు, అట్ట పెట్టెల్లో కరెన్సీ కట్టలు లభించాయి. ఒక్క బీరువాలోనే 5 కోట్లు కరెన్సీ కట్టలు దొరికాయి.
పదుల సంఖ్యల్లోని బీరువాల్లో దాదాపు 142 కోట్ల రూపాయలు లభించాయి. జగన్ రెడ్డి తన దోస్త్ హెటెరో యజమాని పార్ధసారధి రెడ్డి కోసం కేసీఆర్ తో మాట్లాడి రాజ్యసభ సీటు ఇప్పించారు. కరోనా సమయంలో అత్యంత నీచంగా రెమెదెసెవర్ ఇంజక్షన్స్ బ్లాక్ మార్కెట్ చేసి కోట్లు దండుకున్న వ్యక్తిని రాజ్యసభకు పంపిన ఘనత జగన్ రెడ్డిదే. నేడు మళ్లీ అరబిందో ఫార్మా కల్తీ భాగోతం బయటపడింది. తన బినామీ పీవీ రాంప్రసాద్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఏ1, ఏ2 లు అవినీతికి పాల్పడుతున్నారు. లిక్కర్ లో కల్తీ చేసి మద్యం దుకాణాల్లో అమ్మి కొన్ని లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారు. మెడిసన్స్ లో కూడా కక్కూర్తేనా? జగన్ మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఒక సైకో. ధన దాహం పట్టిన పిశాచి. జగన్ రెడ్డి చేసే పనులను చూసి బాధకలుగుతుంది. ట్విటర్ పక్షి విజయసాయి ఈ విషయంపై ట్వీట్ చేయాలి. అసభ్యకరంగా.. ఇష్టానుసారంగా ట్వీట్ లు పెట్టడంకాదు. ఈ అంశంపై ట్వీట్ పెట్టి నీ అల్లుడు కంపెనీ అరబిందో కల్తీ వ్యవహారంపై సమాధానం చెప్పాలి.
కల్తీ మందులు తయారుచేసి కోట్లు దోచుకుంటున్నారు? ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ (యు.ఎస్.ఎఫ్.డి.ఏ)బయట పెట్టిన అంశాలపై తప్పనిసరిగా ముఖ్యమంత్రి, ఏ2 విజయసాయిరెడ్డి లు సమాధానం చెప్పాలి. 108, 104 లు ఇటువంటి కంపెనీలకా ఇచ్చేది. ఇలాంటి కంపెనీలు ప్రజల ప్రాణాలు కాపాడుతాయా? అందుకే మూలన పడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీలను అడ్డం పెట్టుకుని ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నాడో, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.
అరబిందో ఫార్మా అవినీతి గురించి గతంలోనే చెప్పాం. వివిధ రంగాల్లో పనిచేస్తున్న మన దేశ కంపెనీలకు ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. ఉదా. ఫార్మారంగంలో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో జినోమ్ వ్యాలీలో ఏర్పాటైన భారత్ బయోటెక్ కరోనా కష్టకాలంలో ప్రపంచానికి కోవాగ్జిన్ అనే అద్భుతమైన వ్యాక్సిన్ అందించి కొన్ని లక్షలమంది ప్రాణాలు కాపాడి ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేసింది. కానీ, నేడు ఈ అవినీతి ముఖ్యమంత్రి అండతో నిర్వహిస్తున్న అరబిందో, హెటెరో వంటి సంస్థలు కల్తీ మందులు తయారుచేస్తూ, బ్లాక్ మార్కెట్ లో మందులు విక్రయిస్తూ రాష్ట్ర, దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. చంద్రబాబు ప్రోత్సహించిన కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకుంటే జగన్ ప్రోత్సహించిన కంపెనీలు దేశ ప్రతిష్ట మసకబారేలా చేశాయి.
చంద్రబాబునాయుడు రాష్ట్ర, దేశ ప్రతిష్టని కాపాడారు. తను తెచ్చిన కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా అగ్ర భాగాన నిలబెట్టారు. అనేక గొప్ప గొప్ప కంపెనీలను ప్రోత్సహించారు. ఫోర్ ట్వంటీ జగన్ ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర, దేశ పరువును దిగజార్చారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రపంచం చిన్నచూపు చేసేలా చేస్తున్నారు. అరబిందో అవినీతి విషయంలో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఫార్మస్యుటికల్ కంపెనీలు కొన్ని విలువలతో పనిచేయాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలి. ప్రజల మన్ననలను పొందే విధంగా పనిచేయాలి. లక్షలాదిమంది ప్రాణాలను నిలబెట్టే విధంగా పనిచేయాలి.
ఇసుక, మైనింగ్ లలో చేసిన అవినీతి సరిపోక చివరకు మెడిసన్స్ లో కూడా ఈ విధంగా కక్కుర్తి పడతారా? మీ ధనదాహం ఎప్పటికి తీరుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి మనిషే కాదు. మనిషి అని పిలుపించుకునే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదు. మేం ప్రతీది ఆధారాలతో మాట్లాడాం. మేం అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాలి. వైసీపీలా టీడీపీ ఎవరిపైన అనవసరంగా బురద చల్లదు. ఆధారాలతోనే ముందుకొస్తుంది. ఉన్న వాస్తవాలను ధైర్యంగా ప్రజలకు వినిపిస్తాం. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. అంతేగానీ వైసీపీలా బులుగు మీడియాని, పెయిడ్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవరిపైనా బురద చల్లాల్సిన అవసరం మాకు లేదు. పూర్తిగా అన్ని ఆధారాలతో ముందుకు వచ్చాం. అరబిందో ఫార్మా కల్తీ భాగోతాన్ని యు.ఎస్.ఎఫ్.డి.ఏ రాసిన లేఖలు ఆధారంగా బట్టబయలు చేశాం.