Suryaa.co.in

Andhra Pradesh

పవనూ.. ఇంతకీ మా పాలిట నువ్వెవరూ?

నువ్వేమిటో నీకైనా అర్ధమైందా?
ఒకసారి సనాతన ధర్మం అంటావ్..ఇంకోసారి చేగువీరా అంటావ్ ??
ఒకసారి నక్సలైట్ అవుదాం అనుకున్నా అంటావ్…ఇంకోసారి న్యూజిలాండ్ వెళదాం అనుకున్నా అంటావ్ ??
ఒకసారి కామన్ మాన్ ఫోర్స్ అంటావ్…ఇంకోసారి గన్ తీసుకొని రోడ్డు మీద కూర్చుంటావ్ ??
గుండెల నిండా ధైర్యం ఉంది అంటావ్…మెడలో మాత్రం తాయత్తు కట్టుకుంటావ్..
కమ్యూనిస్టు అంటావ్…RSS భావం అంటావ్…
ఎందుకు ఫెయిల్ అయ్యావ్ అంటే…. నీకు చదువు చెప్పే టీచర్లదే తప్పు అంటావ్ ??

ఒకసారి భారతీయుడ్ని అంటావ్… ఇంకోసారి రెల్లి కులంలో పుట్టా అంటావ్…
ఒకసారి నాకు కులం లేదు అంటావ్… నేను కాపు కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నా అంటావ్..

ఒకసారి తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నా అంటావ్…ఇంకోసారి కడప వెళ్లి సిద్దవటంలో పుట్టాలని ఉందంటావ్ ??
ఒకసారి జంధ్యం వేసుకున్నా అంటావ్…ఇంకోసారి బాప్టిజం తీసుకున్నా అంటావ్..

నాన్ వెజ్ మానేశా అంటావ్… గుంటూరు వెళ్లి ఇఫ్తార్ విందు ఆరగిస్తావ్ ??
మనల్ని ఎవడ్రా ఆపేది అంటావ్…ఎవరు ఆపకుండా నువ్వే ఆగిపోతావ్…
“I am projecting myself as a chief minister of Andhra Pradesh” అంటావ్… నాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదంటావ్ ?
ఇంతకీ మాపాలిట నువ్వెవరూ?

– జీఎన్నార్‌

LEAVE A RESPONSE