– పవన్ కళ్యాణ్ సినిమా చాలా ఖరీదు రూ.1000
– ఉపముఖ్యమంత్రి నటించిన సినిమా టిక్కెట్ రూ.1000 పెట్టి విడుదల చేయడం అధికార దుర్వినియోగం కాదా ?
– పేదవాడి ఎంటర్ టైన్మెంట్ లో రూ.1000 పెట్టి జీవో విడుదల చేయడం అవినీతి కాదా?
– అసెంబ్లీ వేదికగా పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు పచ్చి అబద్దాలు
– రాష్ట్రంలో ప్రతి సాగునీటి ప్రాజెక్టు తానే ప్రారంభించినట్లు గొప్పలు
– తాను చేయని పనులను చెప్పుకునేందుకు బాబు తాపత్రయం
– పోలవరం ప్రాజెక్టుకు ఆద్యుడు దివంగత డాక్టర్ వైయస్.రాజశేఖర్ రెడ్డి
– గుంటూరు జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమా చెప్పారు. ప్రజలకే కాదు ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో మాత్రమే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటున్నారని, పరిపాలనకు మాత్రం అందుబాటులో ఉండడం లేదని చెప్పారు. బహుశా సినిమా షూటింగ్ వల్ల అందుబాటులో ఉండడం లేదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయన అప్పుడప్పుడూ కేబినెట్ మీటింగ్ లకే రావడం లేదు. దానికి ఆయనే సమాధానం చెప్పాలి.
పవన్ కళ్యాణ్ సినిమా చాలా ఖరీదు రూ.1000 టిక్కెట్, దాన్ని అభిమానులు భరిస్తారు. ఉపముఖ్యమంత్రి నటించిన సినిమా టిక్కెట్ రూ.1000 పెట్టి విడుదల చేయడం, అధికార దుర్వినియోగం కాదా ? పేదవాడి ఎంటర్ టైన్మెంట్ లో రూ.1000 పెట్టి జీవో విడుదల చేయడం అవినీతి కాదా? ఇది దురదృష్టకరం. సినిమా హిట్ అయితే ఎక్కువ మంది చూస్తారు, డబ్బులు వస్తాయి. కానీ సినిమా ప్లాప్ అయినా కూడా పీక్కు తినాలనుకోవడం తప్పు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమే.
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి ముమ్మాటికీ చంద్రబాబే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు 90 శాతం అసత్యాలే చెప్పారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు విభజిత రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానంటూ తన ఖాతాలో వేసుకోవడాన్ని తప్పు పట్టారు. కేవలం కమిషన్ల కోసమే 2013-14లో నిర్ణయించి రేట్లతో 2017లో పోలవరం నిర్మాణానికి అంగీకరించలేదా అని చంద్రబాబును నిలదీశారు.
చంద్రబాబు ఏ ప్రాజెక్టునూ శంకుస్థాపన చేయలేదు, ప్రారంభమూ చేయలేదు . 1996 లోక్ సభ ఎన్నికలకు, 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు పబ్బంగడుపుకోవడానికి అనేక సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశారు. ఎన్నికలకు ముందు పునాదులు వేసి, ఎన్నికల తర్వాత మర్చిపోవడం ఆయన నైజం. దీనికి నిరసనగా అప్పటికి ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్.రాజశేఖర్ రెడ్డి 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రతి పునాదిరాయి వద్దకు వెళ్లి అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. చంద్రబాబు శంకుస్థాపనలు చేయడం మినహా తట్టెడు మట్టి పోసిందీ లేదు, రూపాయి ఖర్చు పెట్టింది కూడా లేదన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికే ఆ కార్యక్రమం చేశారు.
స్వర్గీయ వడ్డీ వీరభద్రరావు అనే టీడీపీ ఎమ్మెల్యే.. పోలవరం గురించి ఉద్యమం చేసి, సైకిల్ యాత్రతో ఢిల్లీ కూడా వెళ్లాడు తప్ప… చంద్రబాబు ఏ రోజూ ఆ ప్రాజెక్టు ప్రారంభించాలన్న ఆలోచన చేయలేదు. వైయస్.రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తే… తానే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని చంద్రబాబు అబద్దాలు చెప్పడం దురదృష్టకరం. 2017-19 వరకు ప్రతి సోమవారం పోలవరం అని వెళ్లిన చంద్రబాబు .. ఇప్పుడెందుకు వెళ్లడం లేదు?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చాలా జాప్యం అవుతుంది. దీనికి కారణం చంద్రబాబు చేసిన అసమర్థ పాలనే కారణం. ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్లే ప్రాజెక్టు పనులు నాశనం అవ్వడమే కాకుండా పనులు కూడా ఆలస్యం అవుతున్నమాట వాస్తవం.
డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి చంద్రబాబు వైఖరే కారణమని మేం చాలాసార్లు స్పష్టం చేశారు. కాఫర్ డాం పూర్తి కాకుండా ఎవరూ డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడంతో వరద వల్ల గండ్లు పడి, కొట్టుకుపోయింది. ఎక్కడ బాగా కమిషన్లు వస్తాయో అక్కడ బిల్లులు చేసుకునే ప్రయత్నం తప్ప చంద్రబాబు ప్రాజెక్టు పనులు చేయలేదు.
జేజీ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్నా దాని సామర్ధ్యాన్ని పరీక్షించకుండా 2018 డిసెంబరులో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. కేవలం బిల్లులు చేసుకోవడం కోసమే ఇలా చేశారు. 2018 నుంచే వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ -2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. 2027 నాటికి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాడన్న నమ్మకం లేదు.