కాపులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ద్రోహం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ ఆటలో పవన్ పావుగా మారారని అన్నారు. బాబు నుంచి ప్యాకేజీ తీసుకుని 2019 ఎన్నికల్లో అప్పటి తెదేపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు చీల్చి వైకాపాను దెబ్బకొట్టడానికే జనసేన అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపించారు.
కాపులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ద్రోహం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలోని కాపులను తెదేపా అధినేత చంద్రబాబు వద్ద పవన్ తాకట్టు పెట్టాలని చూస్తున్నారన్నారు. జనసేన అధినేత వల్ల ఏ ఒక్కరికీ న్యాయం జరగదని విమర్శించారు. పవన్‌కు రాజకీయ విలువలు, సిద్ధాంతమే లేవని ధ్వజమెత్తారు. ఆర్నెళ్లకోసారి బయటకు వచ్చి సినిమా పంచ్ డైలాగులతో వైకాపా ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.