జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల చేశారు. డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #PawanKalyanAneNenu pic.twitter.com/bz7aOswsDj
— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 19, 2024
హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగానూ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు.
బాధ్యతలు చేపట్టిన పవన్‌కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పవన్‌ను కలిశారు.