– నకిలీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారు
– అందుకే కేసు విచారణ సక్రమంగా జరగడం లేదు
– కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిందే
– ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
తాడేపల్లి: గతంలో మద్యపాన ప్రియులకు ద్రోహం చేస్తున్నావు జగన్ అని ఆవేశంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ … ఇప్పుడు ఏకంగా కల్తీ మద్యం అధికార పార్టీ నేతలు తయారు చేస్తుంటే ఎందుకు మాట్లాడ్డం లేదు ? కల్తీమద్యం తయారీలో అధికారి పార్టీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు.. ఆ బురదను వైయస్సార్సీపీ నేతలకు అంటించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు.
తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నంలో అధికార పార్టీ నేతల అక్రమ మద్యం నిల్వలను బయటపెట్టడంతో.. అడ్డంగా బుక్కైన చంద్రబాబు ప్రభుత్వం జోగి రమేష్ ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలమీద లైడిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నానని.. చంద్రబాబు, లోకేష్ లు అందుకు సిద్దమా? అన్న జోగి రమేష్ సవాల్ పై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. సిట్ విచారణ లో భాగంగా బయటపెడుతున్న లీకులు, పేపర్లలో వచ్చిన కథనాలు ఒకదానికొకటి పొంతన లేకుండా పోతున్నాయి. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కల్తీ మద్యం వ్యవహారంలో నిందితులు కచ్చితంగా బయటపడాలి.