Suryaa.co.in

Andhra Pradesh

మిషన్ రాయలసీమతో రుణం తీర్చుకుంటా!

-మీ పోరాట స్పూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటా
-నారా లోకేష్

రాష్ట్రంలో నాలుగేళ్ల అరాచకపాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా నేను చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి మజిలీని మీ అందరి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయగలిగాను. 124రోజులపాటు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో నాతోపాటు యువగళం బృందాలను కంటికి రెక్కలా కాపాడుకుంటూ రాయలసీమ ప్రజలు మాపై చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరువలేను. అడుగడుగునా సీమ ప్రజల కష్టాలను నేరుగా చూశాక తీవ్ర మనోవేదనకు గురయ్యాను.

రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగునీరు, నిరుద్యోగం, వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాను. అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమ ద్వారా మీ కన్నీళ్లు తుడిచి రుణం తీర్చుకుంటానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నాను. ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులకు ఎదురొడ్డి నిలబడే పోరాట స్ఫూర్తిని మీ నుంచి పొందిన నేను లక్ష్యాన్ని చేరుకునేవరకు విశ్రమించబోను.

LEAVE A RESPONSE