Suryaa.co.in

Andhra Pradesh

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి

జివిఎంసి కమీషనర్ సి.ఎం.సాయి కాంత్ వర్మ

విశాఖపట్నం మే 22:- నగరంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జివిఎంసి కమిషనర్ సి.ఎం.సాయి కాంత్ వర్మ ప్రజా ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కురుపాం మార్కెట్, టౌన్ హాల్ రోడ్డు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డు, కోటవీధి, పెరివీధి, ఫిషింగ్ హార్బర్, కొప్పుల వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటరీ కార్యదర్శులు పారిశుద్ధ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీధులలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని కాలువలు, డ్రైన్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోడ్లను శుభ్రం చేసిన చెత్త పోగులను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 6 గంటల నుండి వీధుల్లో ఉండాలని, క్లాప్ వాహనాలు నిర్ణయత సమయానికే ఇంటింటి చెత్త సేకరణకు వెళ్లేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని కాలువలో వ్యర్ధాలు లేకుండా తొలగించాలన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగు వ్యాపించకుండా ఇప్పటి నుండే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, దోమల వృద్దిని అరికట్టేందుకు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రహదారులలో రాత్రి పారిశుధ్య పనులు సరిగా నిర్వహణ జరగలేదని, రాత్రి పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొన్ని ప్రాంతాలలో భవన నిర్మాణ వ్యర్ధాలు ఉన్నాయని వాటిని తొలగించాలన్నారు.

ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ శివప్రసాద్, ఎ.ఎం.ఒ.హెచ్. కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE