– వడ్డీలో 50 శాతం రాయితీని పొందండి
– పురపాలక శాఖ అడిషనల్ డైరెక్టర్ వి అనురాధ
విజయవాడ: ఆస్థి పన్ను బకాయిలు ఈ నెల 31 లోపు చెల్లించాలని, గడువు లోపు ఒకే సారి ఏకమొత్తంలో చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు పురపాలక శాఖ అడిషినల్ డైరక్టర్ సి. అనురాధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఇంటిపన్ను, ఖాళీ స్థలాలపై పన్నులు సకాలంలో అనగా మొదటి అర్థ సంవత్సరానికి జూన్, రెండవ అర్థసంవత్సరానికి డిసెంబర్ లోపు పన్ను చెల్లించని వారు 2శాతం వడ్డీ తో చెల్లించాల్సి ఉంటుందన్నారు.
అయితే పన్ను చెల్లింపుదారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, పురపాలక సంఘాలలో పేరుకుపోయిన పన్ను బకాయిల వసూళ్లు మెరుగుపరుచుటకు, ఆస్థి పన్ను, ఖాళీ స్థలంపై పన్నులు ఈ నెల 31లోపు ఏకమొత్తంలో ఒకే సారి చెల్లించిన వారికి వడ్డీపై 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. కావున పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.