– కరీంనగర్ డీసీసీ కార్యాలయం లో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్: ఈనెల 24 వ తేదీ చొప్పదండి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామం నుండి కుర్క్యాల చౌరస్తా మీదుగా గంగాధర వరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్ర ప్రతి జిల్లాలో ఒక నియోజకవర్గంలో మొదట దశలో జరుగుతుంది.
ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ఈ పాదయాత్ర విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు,అనుబంధ సంఘాలకు ,పార్టీ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్న.
జనహిత పాదయాత్ర ద్వారా 19 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలతో చర్చిస్తూ వారికి అందుతున్న దానిపై ఆరా తీస్తూ,వారి కష్టాలు తెలుసుకుంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ పక్షాన వారికి అండగా ఉంటూ , ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతుంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోఆర్డినేట్ చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమన్వయం చేస్తున్నారు.
24 వ తేదీ సాయంత్ర పాదయాత్ర తరువాత గంగాధర లో బస ఉంటుంది. 25 వ తేది ఉదయం ప్రభుత్వ పాఠశాలలో శ్రమ దానం ,మొక్కలు నాటే కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మీనాక్షి నటరాజన్ పాల్గొంటారు.
కరీంనగర్ జిల్లా మహిళా సంఘాలకు పెట్టింది పేరు.. వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల యజమానులు, సోలార్ యజమానులు, ఇందిరా క్యాంటీన్ యజమానులుగా ఉన్న మహిళలతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత జిల్లా ముఖ్య కార్యకర్తలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మీనాక్షి నటరాజన్ ఇష్టాగోష్టి తో మాట్లాడతారు..
24 సాయంత్రం జరిగే ఈ కార్యక్రమాన్ని రాజేందర్ రావు,పద్మాకర్ రెడ్డి ,అంజన్ కుమార్ భాస్కర్ రెడ్డి ,అనుబంధ సంఘాల నేతలు సమన్వయం చేస్తారు.