పురపాలికల స్వచ్ఛత లో సాఫాయిల పాత్ర కీలకం
వారి శ్రమతోటే పేటకు అవార్డుల పంట
అభివృద్ధిని అడ్డుకున్నోల్లే అపనిందలు మోపుతున్నారు
రహదారుల విస్తరణకు కేసులతో అడ్డుకున్నారు
కలెక్టరేట్ ను అడ్డుకున్నది వారే
మినీ ట్యాన్క్ బండ కు అడ్డుపుల్లలే
అయినా అవాంతరాలను అధిగమించాం
పట్టణాన్ని సుందరికరిస్తున్నాం
52 గంటల్లో రహదారుల విస్తరణను పూర్తి చేసుకున్నాం
పేట పురపాలికకు అవార్డులు పట్టణ ప్రగతికి దిక్సూచి
ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన పట్టణ ప్రగతి,పల్లె ప్రగతి కార్యక్రమం
అద్భుతమైన ప్రగతితో అభివృద్ధి పథం లోకి
మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యపేటలో ఘనంగా రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకలు
వినూత్నంగా నూతన మహాప్రస్థానంలో పట్టణ ప్రగతి సంబురాలు
అట్టహాసంగా నూతన మహాప్రస్థానంప్రారంభం
– పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కలెక్టర్ వెంకట్రావు,మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు
పట్టణంలో భారీ ర్యాలీ,బతుకమ్మ, ,కోలాటం,కళాకారుల ప్రదర్శనలు
సఫాయి లు మీకు సలాం చేస్తున్నా.పట్టణాభివృద్ధిలో మీ పాత్ర కీలకం.మీరు అందిస్తున్న సేవలతోటే సూర్యాపేట పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు అవార్డులను అందుకుంది.అందులో మీ శ్రమ మీ సేవాతత్పురత దాగి ఉంది అంటూ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పురపాలక సంఘాలలో పని చేస్తున్న సఫాయి కార్మికులకు కితాబిచ్చారు.
రాష్ట్రవతరణ దినోత్సవ శతాబ్ది వేడుకలలో బాగంగా శుక్రవారం సూర్యాపేట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన మహాప్రస్థానంలో వినూత్నంగా జరిగిన పట్టణప్రగతి సంబరాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ పుట్ట్ కిశోర్,జిల్లా కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి నూతనంగా నిర్మించిన మహాప్రసస్థానాన్ని ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు పట్టణాభివృద్ధిలో ప్రధాన భాగస్వామ్యం సఫాయి కార్మికులది ఉందన్న వాస్తవాన్ని విస్మరించ రాదన్నారూ.వారి శ్రమకు గుర్తింపుగా సూర్యాపేట పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగినికి కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకు కొన సాగింపుగా శానిటేషన్ లో ఉత్తమ ప్రతిభ కనపరచడంతో పాటు విధుల్లో క్రమ శిక్షణకు గుర్తింపుగా మరి కొద్ది గంటల్లో హైదరాబాద్ లో రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కలువ కుంట్ల తారకరామారావు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకోవడం అభినంద నీయమన్నారు.
ఇప్పటికే సూర్యాపేట జాతీయ స్థాయిలో మూడు రాష్ట్ర స్థాయిలో ఒకటి పొందగా ఈ రోజు సాయంత్రం సూర్యపేట పట్టణంలో నూతనంగా నిర్మించి నేడు ప్రారంభించుకున్న మహాప్రస్థానం, ఇంటిగ్రేటెడ్ వెజ్&నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కమిషనర్ రామంజుల్ రెడ్డి లు అవార్డులు అందుకోబోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పట్టణ-ప్రగతి కి ఒక దిక్సూచి లాంటిదని ఆయన తేల్చిచెప్పారు.
నేడిక్కడ నిర్మించిన మహాప్రస్థానం భవిష్యత్ తరాలకు ఒక ఐకాన్ గా నిలబడుతుందన్నారు.అద్దె ఇళ్లలో ఉంటూ ఆ ఇంట్లో మరణాలు సంభవించినప్పుడు పడే బాద వర్ణనాతీతం గా ఉంటుందన్నారు.అటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ మహాప్రస్థానం లో ఏక కాలం లో వేరు వేరు గా రెండు కుటుంబాలు అపరకర్మలు చేసుకునేందుకు వెసులుబాటుగా అన్ని సౌజర్యాలతో రెండు పోర్షన్లు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అదే సమయంలో పట్టణాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.అభివృద్ధిని ప్రత్యక్షంగా, పరోక్షంగా, కోర్టుల ద్వార అడ్డుకున్న శక్తులే ప్రభుత్వంపై అపనిందలు మోపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అటు రహదారుల విస్తరణ ఇటు మినీ ట్యాన్క్ బండ నిర్మాణాలను కోర్టు ద్వారా అడ్డుకున్నా అవాంతరాలను అధిగమించి మినీ ట్యాన్క్ బండ నిర్మాణం పూర్తి చెయ్యడమే గాకుండా ఇప్పుడదోక పర్యాటక కేంద్రంగా బాసిల్లుతుందన్నారు.
అంతే కాదు అభివృద్ధి నిరోదకులు కోర్టు ద్వారా అడ్డుకుంటే అడ్డును అధిగమించి రికార్డు సమయంలో అంటే 52 గంటల్లో రహదారుల విస్తరణను పూర్తి చేశామన్నారు.
పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు..ఇక్కడి ప్రజలు బోటు నెక్కలానే కోరిక గూడ తాజాగా ప్రారంభించిన బోట్లలో తీర్చమాన్నారు.ఈ రోజు ఇక్కడ రాష్ట్రవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము అంటే తొమ్మిది ఏళ్ళల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలే కారణమన్నారు.
తెలంగాణ వస్తే ఎమోస్తుంది అని ఇప్పటికి అక్కడక్కడా వాగే మూర్ఖులకు జిల్లా కేంద్రంగా మారిన సూర్యాపేట అక్కడ నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ భవనాల సముదాయం,సూర్యపేట పట్టణం ప్రవేశంతో నిర్మించిన మెడికల్ కలశాల కాళేశ్వరం నుండి పెన్ పహాడ్ మండలం రావి చెరువు వరకు 380 కిలో మీటర్ల దూరం నుండి పారుతున్న సాగు నీరు అని మొహం మీద చెంప చెల్లుమనిపించేలా ఉండాలి అన్నారు.
24 గంటల నిరంతర విద్యుత్ సంగతి కళ్లెదుటే సాక్షాత్కరిస్తున్నప్పుడు మనం చెప్పేది ఏముండదని 2014 కు పూర్వము పట్టణ ప్రజలకు మూసి కంపుకొడుతున్న నీటినుండి విముక్తి లభించిందని చెప్పాలన్నారు.