• రాష్ట్రంలో 84లక్షలమంది విద్యార్థులుంటే, 42లక్షలమందికి ఆర్థికసాయం అందిస్తూ, మిగిలినవారికి జగన్ అన్యాయం చేస్తున్నాడు
• పేదకుటుంబాల పొట్టకొడుతూ, ఆ సొమ్ముని తనఖజానాకు మళ్లిస్తున్నాడు
• అమ్మఒడి కింద ఒకసంవత్సరం రూపాయి ఇవ్వకుండా తల్లులకు పంగనామాలు పెట్టాడు
• అమ్మఒడికింద రూ.26వేలకోట్లు తల్లులకు ఇచ్చిన జగన్, నాన్నబుడ్డి కింద తండ్రుల నుంచి రూ.91వేలకోట్లు కొట్టేశాడు
• నాడు-నేడు పేరుతో వేలకోట్లు దిగమింగి, విద్యార్థుల్ని విద్యకు దూరంచేసి, ఉపాధ్యాయుల ప్రాణాలు బలితీసుకున్నాడు
– మాజీ మంత్రి పీతల సుజాత
అమ్మఒడి పెద్ద దగాఒడి, అబద్ధాల ఒడి అని, గతఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి ఒక ఇంట్లోఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి పథకంకింద తల్లులకు ఆర్థికసాయం అందిస్తామని రాష్ట్రమంతా తిరిగి ప్రజ ల్ని నమ్మించి, అధికారంలోకి వచ్చాక దారుణంగా మోసగించారని, మహిళై ఉండి, సాటిమహిళల్ని మోసగించినందుకు భారతిరెడ్డి వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
“ రాష్ట్రంలో 84లక్షలమంది విద్యార్థులుంటే జగన్ కేవలం 42లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నాడు. 4ఏళ్లలో వారి సంఖ్యను తగ్గిస్తూ,ఇవ్వాల్సిన ఆర్థికసాయంలో మూడేళ్లపాటు కోతపెట్టాడు. ఒకసంవత్సరమైతే పూర్తిగా అమ్మఒడి సొమ్ము ఎగ్గొట్టాడు. 42లక్షలమందికి అరకొరగా అమ్మఒడిఇస్తూ, మిగిలిన 42లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేయడం ఎలాంటి సంక్షేమమో జగన్ వారితల్లులకు సమాధానం చెప్పాలి
ఏటేటా అమ్మఒడి తీసుకునే విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతోంది జగన్? పేదలకు అన్యాయంచేస్తూ, వారికివ్వాల్సిన సొమ్ముని నీ ఖజానాకు తరలించుకుంటున్నావా?
2022లో 43లక్షల96వేలమందివిద్యార్థులకు అమ్మఒడి ఆర్థికసాయం ఇచ్చిన జగన్, ఈ ఏడాది ఆ సంఖ్యను 42లక్షలకే పరిమితంచేశాడు. దాదాపు 2లక్షలమంది విద్యార్థు లు ఏమయ్యారో ముఖ్యమంత్రి చెప్పాలి. ఆయన తీసుకొచ్చిన నూతనవిద్యావిధానం, నాడునేడు వల్ల వారంతా విద్యకు స్వస్తిచెప్పారా? లేక జగన్మోహన్ రెడ్డే వారికి అన్యా యం చేశాడా? అదేవిధంగా విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతిసంవత్సరం ఇస్తానన్న రూ.15వేలు ఏటేటా ఎందుకు తగ్గిపోతున్నాయి?
స్కూల్ మెయింటెనెస్స్, టాయ్ లెట్ల నిర్వహణ కింద ఒక్కోవిద్యార్థికి రూ.2వేలుకోతపెట్టి, రూ.13వేలు మాత్రమే ఇవ్వడమేం టి? గతంలో టీడీపీప్రభుత్వంలో చంద్రబాబునాయుడి హాయాంలో రాష్ట్రంలోని అన్ని పా ఠశాలల్లో వేలకోట్లతో మెరుగైన వసతులు కల్పించాం. అత్యాధునిక వసతులతో పాఠశా లల్లో అదనపు తరగతిగదుల్ని నిర్మించాము. డిజిటల్ విద్యాబోధనకు శ్రీకారంచుట్టాం. జగన్ వచ్చాక నాడు-నేడు పేరుతో పాఠశాలల్ని రద్దుచేసి, లక్షలాది విద్యార్థుల్ని విద్య కు దూరంచేశాడు. ఆఖరికి ఉపాధ్యాయుల్ని కూడా మద్యందుకాణాల ముందు నిలబె ట్టి, నాడు-నేడుపేరుతో వారిపై ఒత్తిడితెచ్చి, పనిభారంపెంచి, వారిజీవితాల్ని బలితీసు కున్నాడు. రూ.16వేలకోట్లు ఖర్చుపెట్టి, నాడు-నేడుకింద విద్యావ్యవస్థను సంస్కరిం చినట్టు జగన్ చెప్పడం పచ్చిఅబద్ధం.
అమ్మఒడిని నాన్నబుడ్డిగా మార్చిన జగన్, తల్లులకు రూ.26వేలకోట్లు ఇచ్చి, తండ్రులనుంచి రూ.91వేలకోట్లు కొట్టేశాడు
జగన్ 4ఏళ్లలో అమ్మఒడిని నాన్నబుడ్డిగా మార్చాడు. అమ్మఒడి పథకం కింద జగన్ రూ.26వేలకోట్లు ఖర్చుపెట్టి, పత్రికాప్రకటనల్లో మాత్రం పచ్చిఅబద్ధాలు చెబుతున్నాడు . నాన్నబుడ్డి ద్వారా ప్రజలజేబులకొట్టి, కల్తీమద్యం అమ్మకాలతో జగన్ రూ.91వేల కోట్లు లాగేస్తున్నాడు. అమ్మఒడికింద తల్లులకు ఇచ్చేది గోరంత అయితే, తండ్రుల నుంచి కొట్టేస్తోంది గుప్పెడంత. ఇదేనా జగన్ రెడ్డి అమ్మఒడితో నువ్వు విద్యార్థుల్ని, వారితల్లుల్ని ఉద్ధరిస్తున్న విధానం? ఏప్రభుత్వమైనా ఏటికేడు పథకాల లబ్ధిదారుల సంఖ్యను పెంచుకుంటూపోతుంది.
కానీ జగన్మోహన్ రెడ్డిమాత్రం తనపాలన ముగిసే కొద్దీ పథకాల్లోకోతలు పెడుతూ, అర్హులకు తీవ్రఅన్యాయంచేస్తున్నాడు. వైసీపీప్రభుత్వం లో పేదలకు మాత్రమే పథకాల్లో కోతపెడుతున్నారు. ఆంక్షలు, తలతిక్క నిబంధనల తో జగన్ ఏటా లబ్ధిదారులకు అన్యాయంచేస్తూ, ఆ సొమ్ముని తనఖాతాకు మళ్లించు కుంటున్నాడు. ప్రాథమికవిద్యతో పాటు, ఉన్నతవిద్యను కూడా జగన్ సర్వనాశనం చేశాడు. చంద్రబాబుహాయాంలో కూడా మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్డం జరిగింది. అదేసమయంలో మాతృభాషకు ప్రాధాన్యతఇస్తూ, ఇంగ్గ్లీష్ మీడియం చదువుని ఐచ్ఛికంగా ఎంచుకునేలా విద్యార్థులకు అవకాశం కల్పించారు.
టీడీపీప్రభుత్వంలో డిగ్రీ, పీజీవిద్యార్థులకుస్కాలర్ షిప్పులు అందిస్తే, జగన్ వచ్చాక వాటిని ఎత్తేశాడు. దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థుల విద్యకోసం చంద్రన్న తీసుకొచ్చిన విదేశీవిద్యపథకాన్ని అటకెక్కించాడు. దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరంచేసిన ఘనత జగన్ కే దక్కింది. నిండా అవినీతి, తప్పుల్లో కూరుకుపోయిన జగన్ ఏముఖం పెట్టుకొని సిగ్గులేకుండా ఎదుటివారి భార్యల గురించి, వారి వ్యక్తిగత జీవితాలగురించి మాట్లాడుతున్నాడు?
తల్లికి వందనం పథకంపై విద్యార్థులు, తల్లులనుంచి అనూహ్యస్పందన వ్యక్తమవుతోంది
జగన్మోహన్ రెడ్డి మోసాలతో, ఉత్తుత్తిసంక్షేమంతో దారుణంగా బలైన పేదలకు న్యాయం చేయడానికే చంద్రబాబు నాయుడు మహానాడుసాక్షిగా మినీమేనిఫెస్టో ప్రకటించారు. దానిలో భాగంగా ‘తల్లికి వందనం’ పథకంతో ప్రతితల్లికి న్యాయంచేస్తానని, ఒకఇంట్లో ఎంతమందిపిల్లలుంటే అందరికీ ఏటా రూ.15వేలచొప్పున అందిస్తానని టీడీపీ అధినేత భరోసా ఇచ్చారు. దానిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారితల్లుల నుంచి అనూహ్యస్పందన వ్యక్తమవుతోంది.” అని సుజాత తెలిపారు.