Suryaa.co.in

Andhra Pradesh National

పెమ్మసాని చంద్రశేఖర్ అనే నేను..

-పార్లమెంటున తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని

‘పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను.. లోక్ సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా..’ అంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ వేదికగా తెలుగులో ప్రమాణ స్వీకారం సోమవారం చేశారు.

ప్రో టెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భర్త్రు హరి మెహతాబ్ లకు అభివాదం చేసారు.

ఆ తర్వాత పెమ్మసాని స్పందిస్తూ ‘నాకు ఎంపీగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు, అలాగే 3.44 లక్షల భారీ మెజారిటీతో నాకు ఈ విజయం అందించిన మా పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

LEAVE A RESPONSE