Home » రాష్ట్రంలో పింఛన్ల పండుగ

రాష్ట్రంలో పింఛన్ల పండుగ

• ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రన్న… రూ. 7000 పెన్షన్ పంపిణీ
• రాజకీయ లబ్ధికోసం నాడు పండుటాకులను ఇబ్బంది పెట్టిన జగన్
• మండుటెండలో నిలబెట్టి 60 మంది ప్రాణాలు తీసిన జగన్ రెడ్డి
• జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం.. అప్పుల ఊభిలో రాష్ట్రం
• పోలవరాన్ని గోదాట్లో ముంచి… మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేశాడు
• కరెంట్ బిల్లులు ఎకువస్తే పింఛన్ కట్ చేశాడు, రాజకీయ దురుద్ధేశంతో పింఛన్ లు తొలగించారు
• కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికి పింఛన్లు పంపిణీ
శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు

మంగళగిరి: రాష్ట్రంలో నేడు పండుగ వాతావరణం నెలకొందని.. పోయిన నెల 4న నరకాసుర వద జరిగి ప్రజలు పండుగ జరుపుకుంటే. నేడు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం కనిపిస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. మాటతప్పం, మడమ తిప్పమని రాష్ట్రాన్ని అన్నిరకాలుగా భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ జగన్ రెడ్డి అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే హామీని నెరవేరస్తూ… రాష్ట్రంలో 65 లక్ష మంది పింఛన్ దారులకు ఒకేసారి రూ. 7000ల చొప్పున వితంతువులు, వికాలంగులతోపాటు అన్ని రకాల పింఛన్లు ఇవ్వడం దేశ చరిత్రలో అరుదైన రికార్డు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ ఖజానాను జగన్ రెడ్డి చంద్రబాబుకు అప్పగిస్తే.. జగన్ రెడ్డి విధ్వంసక పరిపాలన, అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ.. తనకు ఉన్న అపారమైన అనుభవంతో కొత్త ఒరవడికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. పాత బకాయిలతో కలిపి ప్రతి ఇంటికి వెళ్లి నేడు రూ. 7000 పింఛన్ ఇవ్వడం హర్షణీయం. అనాడు జగన్ రెడ్డి రూ. 2000 ఉన్న పింఛన్ ను మూడు వేలు చేస్తానని చెప్పి రెండేళ్లకు ఒకసారి రూ.250 పెంచుతూ… పింఛన్ దారులను మోసం చేశాడు.

ప్రజలను మభ్యపెడుతూ… మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడపాలనుకున్నాడు జగన్ రెడ్డి. అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థను కేవలం రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటూ పింఛన్ దారులను బెదిరిస్తూ… బ్లాక్ మెయిల్ చేశారు. కోర్టు అక్షింతలు వేస్తే వాలంటీర్ వ్వవస్థను పక్కన పెట్టారు.

పింఛన్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోకుండా.. మండుటెండలో వృద్ధులను హింసించి సానుభూతి పొందాలని చూశారు. మండుటెండలో 60 మంది పండుటాకుల ప్రాణాలు తీశారు. దాన్ని ప్రజలు ఛీత్కరించారు. చీదరించుకున్నారు. అందుకే ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు.

నేడు ఉదయం 6 గంటలకు మొదలు పెట్టి నూటికి 80 శాతం పింఛన్ లు ఇప్పటికే వారి ఇంటి వద్దకు వెళ్లి అందించిన సమర్థ నాయకుడు చంద్రబాబు. ఒక పండుగ వాతావరణంలో నేడు పింఛన్ల పంపిణీ చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. జగన్ రెడ్డి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసినా కూడా తాను చేసిన పాపాలకు పరిష్కారం లేదు. నేడు ఆయన వేదాంతం మాట్లాడుతున్నాడు. చేయాల్సింది అంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. ఇలాంటి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.

దేశంలో మొట్టమొదటిసారి రూ.30 తో అన్న ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వృద్ధులు, వికలాంగులకు భరోసా కల్పించాలి. వారి కళ్లలో ఆనందం చూడాలన్న సమున్నత ఆశయంతో ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పింఛన్ విధానం తీసుకు వచ్చారు. తరువాత దాన్ని చంద్రబాబు రూ. 75 రూపాయాలు చేశారు. ఆ తరువాత పది సంవత్సరాలకు కాంగ్రెస్ రూ. 200 వందలకు పెంచింది.

2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా.. రాష్ట్రంలో క్లిష్టతరమైర పరిస్థితులు ఉన్నా.. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ ను 2000 పెంచారు. వృద్ధులు, వితంతువులతో పాటు చర్మకారులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులకు, కిడ్నీ పేషంట్ లకు, ఒంటరిమహిళలతో పాటు ఎన్నో వర్గాలకు పింఛన్ లు ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తి చంద్రబాబు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా దాన్ని సరిదిద్దగలిగే సత్తాగల, సమర్థత గల నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టే ప్రజా కూటమి నేడు ఎన్నికల హామీని నెలబెట్టుకోగలిగింది. అనగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలకు డైరెక్ట్ గా ఇంటికే సంక్షేమ ఫలాలు అందించిన చరిత్ర చంద్రబాబుది. ప్రజలందరు ఈ వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు. సమర్థవంతమైన నాయకత్వం, తెలివి తేటలద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకో గలిగిన నాయకుడు చంద్రబాబు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ రెడ్డికి అలవాటైన పని. ఒక నేరస్తుడికి ఒక నాయకుడికి ఉన్న వ్యత్యాసం ప్రజలు గమనిస్తున్నారు.

2014 -19 మధ్య వ్యవస్థలను గాడిలో పెట్టి పారదర్శకతో, జవాబుదారితనంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో కలబొల్లి కబుర్లు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది. పోలవరాన్ని ముంచారు.

మూడుముక్కలాటతో అమరావతి నాశనం చేశారు. విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెంచి దోచుకున్నారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థంగా మార్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. మోసపూరిత హామీలతో మభ్య పెట్టడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.

ఒకనెల తీసుకోకపోయినా.. రాజకీయంగా విభేదించినా పింఛన్ లు తొలగించేవారు. కరెంట్ ఛార్జీలు ఎక్కువ వచ్చినా.. బ్రతకడానికి ఆటోలు కొనుక్కున్నా పించన్ తొలగించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షల కోసం అధికారంలోకి వచ్చింది. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్నవారందరికి కూటమి ప్రభుత్వంలో పింఛన్లు అందిస్తారు.
భవిష్యత్ మీద భరోసా కోసం సమర్థవంతమైన నాయకత్వం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మీద నమ్మకంతో కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చారు. కష్టం తెలిసిన వాడే కష్టాన్ని తీర్చగలడు. ఆకలి బాధ తెలిసిన వాడే కడుపు నింపగలడు, కన్నీటి విలువ తెలిసిన వాడే కన్నీళ్లు తుడవగలడు. చెప్పింది చేయడం చంద్రన్నకే సాధ్యం.

Leave a Reply