– మంత్రి కొండపల్లి
కడియం: ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మండల కేంద్రమైన కడియంలో గురువారం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక నేతలతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోసగంటి సత్యవతి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని, టిడిపి వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్, ఎమ్మార్ పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, వైస్ చైర్మన్ బోడపాటి గోపి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ,యర్ర వేణుగోపాల రాయుడు, రూరల్ బిజెపి ఇంచార్జ్ ఆకుల శ్రీధర్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, ఆదిమూలం సాయి బాబా, చిలుకూరి ప్రభాకర్, గెడ్డం శివ, నాగిరెడ్డి రామకృష్ణ, జంగా వినోద్, డ్వాక్రా పిడి ఎన్ వి వి ఎస్ మూర్తి, ఎంపిడిఓ కె.రమేష్, తదితరులు పాల్గొన్నారు.