– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిధున్ రెడ్డి
నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేపట్టిన ఓదార్పు యాత్ర లో వైసిపి పై చేస్తున్న విమర్శల్లో నిజం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు ఏలూరు పార్టీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ నేతలకు కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ప్రజలను వేదించాయని, నేడు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకు చేరువ చేశామని అన్నారు.
పెన్షన్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడే దుస్థితి నుంచి నేడు ప్రతీ నెల మొదటి తేదీన నేరుగా వారి ఇంటికే వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. నాడు ప్రజాధనం తేదేపా నేతల జేబుల్లోకి వెళితే నేడు నగదు బదిలీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళుతున్నాయని అన్నారు. గోదావరి జిల్లాల్లో వైసీపీ పటిష్టంగా ఉందని, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయ ఢంకా మోగిస్తామని అన్నారు.
వై ఏపీ నీడ్స్ జగన్ అనేక కార్యక్రమాన్ని విస్త్తృతంగా తీసుకెళ్లాలని, సామాజిక బస్సు యాత్రను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తల కష్టం వృథా కాదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తను గుర్తించి, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి నూజివీడు ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఉంగుటూరు ఎమ్మెల్యే ఉప్పల వాసు బాబు చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు